అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ తాను అండగా ఉంటానని, ఎలాంటి కష్టమొచ్చినా తాను చూసుకుంటానని వైఎస్సార్సీపి నియోజకవర్గ ఇన్చార్జి మలసాల భరత్ పేర్కొన్నారు. సోమవారం తాళ్లపాలెం సంతలో ప్రమాదవసాత్తు పూరి గుడిసె కాలిపోవడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడి కట్టుబట్టలతో మిగిలింది. విషయం తెలుసుకున్న ఆయన ఆ కుటుంబాన్ని పరామర్శించారు. అత్యవసర సహాయం క్రింద రూ.10వేలు ఆర్ధిక సహాయాన్ని చేశారు. గుడిసె కాలిపోయిన బాధితులకు న్యాయం జరిగేలా ఇల్లు మంజూరు చేయించేందుకు తహశీల్దార్ తో మాట్లాడతానని చెప్పారు. ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా నిత్యవసర సరుకులు సమకూర్చుకొవాలని కోరారు. తన అనుచరులకు ఈ కుటుంబ బాధ్యతను అప్పగించారు. కుటుంబానికి అండగా ఉండాలని చెప్పారు. ఆయన వెంట కశింకోట మండల వైఎస్సార్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.