చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టడమే ధ్యేయంగా ఆయన దినచర్య సాగుతుందని వైఎస్సార్సీపి నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేటి శివ, రాష్ట్ర వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొడ్డేటి లక్ష్మీ నరసింహంరావు, సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ కేఎం నాయుడులు సోమవారం విలేకరుల మాట్లాడారు. జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలలోకి వెళ్లనివ్వకుండ, తప్పుడు రాతలతో ప్రజలను ఏమారుస్తూ, పాలకపక్షంపై బురద జల్లడంలో చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల అపారమైన అనుభవాన్ని ఆర్జించారన్నారు. విషపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈరోజు ఇచ్చిన మాట కోసం అన్ని వర్గా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే..విషపూరితమైన రాజకీయాలు చేయిస్తున్న చంద్రబాబు గౌరవానికి ఇది తగదన్నారు. ప్రజలు విద్యావంతులని, ప్రస్తుతం ఎంతోచైతన్యంగా ఉన్నారని వారంతా వైయస్ జగన్మోహన్ రెడ్డి నీ మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చూస్తున్నారన్నారు. అనకాపల్లి లో ఎలాంటి వేధింపులు లేకుండా అవినీతి కి తావు లేని పరిపాలన అందించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దాడి నారాయణరావు , నూకాంబిక ధర్మకర్త బుద్ధ నరసింగ రాజు..భోగలింగెస్వర స్వామి ఆలయ ధర్మకర్త వాసుపల్లి తాతీయులు, బుద్ధ మురళి మద్దాల సురేష్ పాల్గొన్నారు.