వైన్ షాపు లైసెన్స్ ఉన్నవారు తప్పితే ఏ ఒక్కరు అక్రమంగా మద్యం అమ్మకాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జోగారావు హెచ్చరించారు. పాయకరా వుపేట మండలంలోని మంగవరం గ్రామంలో దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం అమ్ముతున్న గీశాల లక్ష్మి,గీశాల శివ అనే వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంచి సుమారు రూ. 13,250 విలువ గల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ కి పంపించారు. ఈసందర్భంగా ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ, ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరైన గ్రామాల్లో బెల్టుషా పులు నిర్వ హించినా,సారా అమ్మకాలు, మద్యం రవాణాచేపట్టినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.