మహా విశాఖ నగరపాలక సంస్థ నుంచి మీడియాకి ఎలాంటి ఉపయోగమూ లేదు..ఏడాదిలో ఒక్కసారి ఇచ్చే రూ.2వేల ప్రకటన కోసం ఎవరూ పనగట్టుకొని ప్రచారం చేస్తారు..? అన్ని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కోసం ఎందుకు ఉచితంగా ప్రచారం చేయాలి..? కానీ ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున వస్తుంది. జివిఎంసీకి చెందిన ప్రతీ సమాచారాన్ని స్థానిక పత్రికల నుంచి పెద్ద పత్రికల వరకూ ప్రతీ ఒక్కరూ ప్రతినిత్యం ప్రచారం చేస్తారు. ఒక్క విశాఖపట్నం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జల్లాల్లోని పత్రికలు కూడా ప్రచారం కల్పిస్తున్నాయి. దానికి కారణం ఒక్కటే జివిఎంసీలో పీఆర్వోగా పనిచేస్తున్ననాగేశ్వర్రావు మాత్రమే. విశాఖలో చాలా ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పటికీ ఒక్క జివిఎంసీకి మాత్రమే ఇంత పెద్ద స్థాయిలో ఉచితంగా ప్రచారం దక్కుతుందంటే దానికోసం ఆయన అందరు మీడియా ప్రతినిధులు,పత్రి కలు, మీడియా లోని అన్నివర్గాల ప్రతినిధులను మచ్చిక చేసుకొని ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంతో కీలక భూమిక పోషిస్తున్నారు. ఇలా చేయడం, జివిఎంసికి, కమిష నర్ కు, మేయర్ కు పెద్ద ఎత్తున ప్రచారం కలిగేలా చేయడం కూడా కొంతమందికి కంటిలో కరంపడినట్టుగా ఉంది. ఎలాగైనా ఈయనపై బురద చల్లేందుకు పనిగట్టు కొని మరీ తప్పుడుప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఎలాగైనా తప్పుడుగా చిత్రీకరిస్తే..ఆయనకి అదనంగా అప్పగించిన పీఆర్వో సీటుని తప్పించవచ్చుననేది కుట్రలో దాగివున్నబావంగా కనిపిస్తున్నది. స్వచ్ఛ భారత్, జివిఎంసి అభివృద్ధి కార్యక్రమాలు, కమిషనర్ పర్యటనలు, మేయర్ ప్రభుత్వ కార్యక్ర మాలు ఇలా ఒకటికాదు రెండు కాదు..అన్ని రకాల సమాచారం ప్రజలకు చేరవేసేందుకు అన్ని మీడియాసంస్థలను తనమంచి తనంతో చేరువచేసుకొని మరీ ప్రచారం కల్పించడంలో ముందుం టారు. ఆ ఒక్కరాణమే ఆయన ఉద్యోగం జూనియర్ అసిస్టింట్, ఏపీఆర్వో కేడర్అయినా ఈయనకు అదనపు బాధ్యతలు ప్రచారం విభాగంలో అప్పగించడానికి కారణం అవుతున్నాయి. దానిని జీర్ణించుకోలేని కొందరు తప్పుడు ప్రచారాలకు తెరలేపారు. జివిఎంసీ మీడియా విభాగంలోనూ, అధికారుల్లో నూ ఏదో జరిగిపోతుందంటూ కట్టు కధలు అల్లే పనికి పూనుకుంటున్నారు. వాస్తవానికి ఆయన ద్వారా అందే సహాయం అన్ని మీడియా వర్గాలతోనూ ఆయనకుండే స్నేహబంధమే చాలా వ్యతిరేక వార్తలు కూడా జివిఎంసీ కోసం ప్రచురితం కాకుండా ఉండిపోతాయంటే అతిశయోక్తికాదు. అలాంటి ఇన్చార్జి పీఆర్వో నాగేశ్వర్రావుపై వస్తున్నతప్పుడు ప్రచారంపై ఏది నిజమో అధికారులకు, మీడియా ప్రతినిధులకు కూడా తెలియాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఏనుగులు నడుస్తుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి..అవి వాటితప్పు కాదు.. వాటినైజం. ఏనుగు ఆకారం చూసి ఏదో జరిగిపోతుందనే భావన,భయంతోనే అలాంటి ప్రచారాలు జరుతున్నాయనే ప్రచారం కూడాప్రస్తుతం విశాఖ మహానగరంలో జరుగుతుంది. ఈ తేడాప్రచారాల్లో అసలు వాస్తవమేంటో తెలుసుకుంటే..ఏది నిజమో జరిగే తప్పుడుప్రచారాల్లో ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది.