విశాఖ నగరంలో పచ్చదనంను పెంపొందించేందుకు జివిఎంసి అన్ని జోన్ల పరిధిలో మిద్దె తోటల పెంపకంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు జివిఎంసి ఎకో వైజాగ్ నోడల్ అధికారి, ప్రొజెక్ట్ ఆపీసరు డి.లక్ష్మి తెలిపారు. జివిఎంసి కమీషనరు ఆదేశాల మేరకు ఎకో వైజాగ్, ఎకో-గ్రీన్ కార్యక్రమాలలో భాగంగా అక్కయ్యపాలెం పరిధిలో రామచంద్రనగర్ కాలనీలో 100 మందికి పైగా గృహస్తులను ఎంపిక చేసి మిద్దె తోటల పెంపకంపై మంగళవారం యుసిడి అధికారులతో అవగాహన కార్యక్రమం చేపట్టారు.
ప్రతి భవనాలపై, అపార్ట్ మెంట్లపై గేటేడ్ కమ్యూనిటీల వద్ద మిద్దె తోటల పెంపకం వలన కావలసిన కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలను మనము ఇళ్ళలో పెంచుకోవడం ద్వారా ఆరోగ్య పరిరక్షణకు దోహద పడడమే కాకుండా ఆర్ధిక లాభం చేకుర్చుకోవచ్చనని తెలిపారు. దీనితో పాటు మిద్దె తోటల వలన కొండ కాలుష్య నివారణ, గాలి శుభ్రపరచుట, వాతావరణ మార్పులను అరికట్టేందుకు ఉపయోగపడుతుందని నివాసితులకు చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో సిటిజి సభ్యులు విజయలక్ష్మి, ప్రభాల్ వారి అనుభవాలను కొలనీ నివాసులకు తెలియజేశారు. ఈ మిద్దె తోటల అవగాహన కార్యక్రమములు జివిఎంసి యుసిడి సెక్షన్, సస్టైనబిలిటి అండ్ రిలయన్స్ యూనిట్ (ఎస్.ఆర్.యు), టీమ్ సిటీ టెర్రస్ గార్డెన్స్ (సిటిజి) గ్రూప్ తో కలసి నిర్వహిస్తున్నామన్నారు.