గ్రామంలో సర్పంచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతుందని తన ఇస్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారని మామిడిపాలెం గ్రామస్తులు మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వ పట్టా ఇచ్చిన స్థలములో నిర్మిస్తున్న ఇంటిని రెవెన్యూ అధికారులు తొలగిస్తుండగా లబ్ధిదారులు అడ్డుకున్నారు, అనకాపల్లి మండలం మామిడిపాలెం రెవెన్యూ సర్వేనెంబర్ 149 లో పల్లా సన్యాసమ్మ పల్లా ఈశ్వరరావు చెల్లూరి లక్ష్మి ల పేరుమీద ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టా స్థలంలో గృహ నిర్మాణం చేస్తుండగా రెవెన్యూ అధికారులు అక్రమంగా తొలగించేందుకు ప్రయత్నించారని బాధితులు వాపోయారు. స్థలం మాది అని నిరూపిస్తూ హక్కుదారులమని చెబుతున్న
తన విధి నిర్వహణలో బాధ్యతలు కూడా మర్చిపోయి కొందరు రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ అన్యాయంగా వీఆర్వో ఇంటిని కూల్చడానికి ప్రయత్నం చేశారని వారన్నారు. కొందరి మోచేతి నీళ్ళు తాగుతూ ఉద్యోగ నిర్వహణ వారికి అనుగుణంగా చేయడం రెవెన్యూ అధికారులకు తగదన్నారు. ఇదంతా స్థానిక సర్పంచ్ రాజకీయ కక్షతోనే మమ్మల్ని వేధిస్తున్నాడని వైఎస్సార్సీపీ నాయకులం అయిన మమ్మల్ని రాజకీయంగా అనగదొక్కేందుకు అధికారులతో కుమ్మక్కై బాధిస్తున్నాడని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు 20 సెంట్లు స్థలంలో నిర్మాణం చేస్తే వత్తాసు పలికిన సర్పంచ్ ఇప్పుడు పట్టా ఉన్న లబ్ధిదారులను ఇబ్బందులు గురి చేస్తున్నాడని అన్నారు. సర్పంచ్ కు ఇష్టమైతే పట్టా లేకపోయినా ఇక్కడ పండగ చేసుకోవచ్చని అతనికి నచ్చని వారు హక్కు దారులైన ఆ స్థలంలో ఏ విధమైన నిర్మాణం చేయడానికి పనికిరారని ఇది ఇక్కడ వ్యవహారం అని తెలిపారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి మాకు న్యాయం చేయాలని గ్రామస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు.