భూ యాజమాన్య చట్టాన్ని నిరసిస్తూ న్యాయవాదుల పాదయాత్ర


Ens Balu
43
Anakapalle
2024-01-09 15:50:58

ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ యాజమాన్య హక్కు చట్టం  27/2023 ను నిరసిస్తూ న్యాయవాదులు మంగళవారం పాదయాత్ర చేపట్టి నిరసన తెలిపారు. అనకాపల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో రైతు గిరిజన సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించని చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. న్యాయ పరిధిని తగ్గించి ఎగ్జిక్యూటవ్ పరిధిలోకి భూ యజమాన నిర్ణయాన్ని అప్పగించడం తో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని అన్నారు. కోర్టు నుంచి నాలుగు రోడ్ల వరకు పాదయాత్ర చేపట్టి మానవహారం నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ కి వినత పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శేఖర్ మంత్రి సాయి లక్ష్మణ్, సెక్రటరీ సూర  శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బంధం వెంకటరమణ, సీనియర్ న్యాయవాదులు తిలక్ ,భవాని ప్రసాద్ , కుమార్, హర శ్రీనివాస్, సుధాకర్, గంగాధర్, సాయి , గంగాధర్, మోహన్, గోవిందు, సత్యనారాయణ, సముద్రిక లీల, తదితరులు పాల్గొన్నారు.