జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో రైతులు


V.K.Mahesh
42
Gopalapatnam
2024-01-11 13:31:50

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని వైఎస్సార్సీపి రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ నేతృత్వంలో గోపాలపట్నం జడ్పీ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలు, ముగ్గులు పోటీలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిధులుగా వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంప్రదాయాలు ఇనుమడింపచేసే విధంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు అద్భుతంగా ఉన్నా యని అన్నారు. రైతులు బాగుంటేనే సమాజం బాగుంటుందని, గడిచిన నాలుగున్నర సంవత్సరాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభు త్వం చూసుకుందని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలన్న, మహిళలు సుఖ సంతోషాలతో  ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని, ఇందుకు ప్రజలంతా సహకరించాలని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు.  మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గంలోని 14 వార్డుల మహిళలు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సంక్రాంతి  రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా రైతులు, మహిళలలో మరింత ఆనందాన్ని నింపాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి అండదండలు ఎప్పుడు ఉంటాయని అమర్నాథ్ చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి మంత్రి అమర్నాథ్, సుబ్బారెడ్డి బహుమతులు అందజేశారు.