విశాఖజిల్లా గ్రంధాలయ సంస్థను మరింతగా అభివృద్ధిచేస్తా


Ens Balu
44
Visakhapatnam
2024-01-12 07:09:54

విశాఖజిల్లా గ్రంధాలయ సంస్థను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబెడతానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కొండా రాజీవ్ గాంధీ తెలియజేశారు. శుక్రవారం ఆయ న  జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ గా భాద్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రంధలాయాల వినియోగంపై ప్రజల్లో మరింత చైత న్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలోని గ్రంధాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం  వైఎస్.జగన్మోహ నరెడ్డి తన పై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ముచేయకండా సంస్థను విజయపథంలో నడిపిస్తానని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్నచొరవతో గ్రంధాలయాలు దేశం చూపుని ఆకర్షిస్తున్నా యని అన్నారు. త్వరలోనే డిజిటల్ గ్రంధాలయాలు కూడా అందుబాటులోకి రానున్నాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో  కార్యదర్శి సిహెచ్ వెంకట్రా వు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.