వసతి గృహ విద్యార్ధినిని అభినందించిన జేసి జాహ్నవి


ErleSrinu
42
Nathavaram
2024-01-12 13:39:13

విద్యార్ధి దశ నుంచే పోటీపరీక్షలు, వకృత్వ పోటీల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని జాయింట్ కలెక్టర్ జాహ్నవి పేర్కొన్నారు. వినియోగదారుల ఫోరం వారోత్సవాల్లో జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో పాతరదుర్గ భవానీ మొదటిస్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ మేరకు  అనకాపల్లి జాయింట్ కలెక్టర్ జాహ్నవి  ప్రశంసాపత్రం, రూ.1500 నగదను అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి టి. అమృతకుమార్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతూ ఈ స్థాయికి రావడం ఎంతో గర్వకారణమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్యామల మాట్లాడుతూ, హాస్టల్లో చదువుతూ ఈ స్థాయికి రావడం మంచి పనిణా మం అన్నారు. విద్యార్ధిని వకృత్వపోటీల్లో మొదటి స్థానం సాధించచడం పట్ల నాతవరం జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం ఎస్ఎస్. శాంతకుమారి, ఎస్సీ బాలికల సంక్షేమ అధికారి కె.నూకరత్నం దుర్గాభవానీలు అభినందించారు.