ఆర్కేబీచ్ తీర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దండి
Ens Balu
25
Visakhapatnam
2024-01-12 14:18:51
విశాఖ సాగర తీరాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో పాటు ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జివిఎంసి కమిషనర్ సిఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్కే బీచ్ నుండి భీమిలి బీచ్ రోడ్డు వరకు సెంట్రల్ మీడియన్, గార్డెన్లను, వర్టికల్ గార్డెన్లను, పలు రోడ్లను, ఫుట్పాత్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, విశాఖ నగరానికి ఎంతో సువిశాలమైన తీర ప్రాంతం ఉందని ఎంతోమంది సందర్శకులు, పర్యాటకులు నగరానికి వస్తారని వారందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా పనులు చేపట్టాలన్నారు. నగర సుందరీకరణ దృష్ట్యా బీచ్ రోడ్ సెంటర్ మీడియన్లలో, పలు బీచ్ గార్డెన్ లలో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సెంట్రల్ మీడియన్, గార్డెన్ల నిర్వహణ పనులు నిబంధనలకు అనుగుణంగా పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిడి హార్టికల్చర్ ఎం.దామోదరరావును కమీషనర్ ఆదేశించారు. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు రోడ్లు, పుట్పాత్ లు, సెంటర్ మీడియన్, వర్టికల్ గార్డెన్స్ సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను కమీషనర్ ఆదేశించారు. అలాగే సెంటర్ మీడియన్ లో ఆకర్షణీయమైన మొక్కలను దగ్గరగా వేసి నిరంతరం పర్యవేక్షించాలనన్నారు. సెంటర్ మీడియన్ లో మొక్కలు నాటేటప్పుడు మట్టి రోడ్డుపై పడకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కొన్ని చోట్ల మొక్కలు నిర్వహణ సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. గాదిరాజు ప్యాలెస్, ఇతర బీచ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్స్ ను అందంగా తీర్చిదిద్దుతూ నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సెంటర్ మీడియన్ లో మొక్కలను పశువులు తినకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 3వ జోనల్ కమిషనర్ విజయలక్ష్మి, ఏఈ సురేష్, హెచ్ఓలు పాల్గొన్నారు.