తమ హక్కుల సాధన కై పోరాటం చేస్తున్న ఐసిడిఎస్ అంగన్వాడీ కార్యకర్తల ఎస్మా ప్రయోగించి బెదిరిస్తారా..? ఉద్యోగాల్లో చేరకపోతే ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరిస్తా రా..? అంటూ తెలుగు దేశం పార్టీ యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ మండి పడ్డారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర అంగన్ వాడి కార్యకర్తలు నిర్వహి స్తున్న నిరసన శిబిరంలో పాల్గొని వారి నిరసనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేవా దృక్పథానికి అంగన్వాడీలు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఎందరో పిల్లకు విద్యాబుద్దులు చెప్పే తల్లిగా కొనసాగుతున్న వాళ్ళని గౌరవంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. భారత దేశంలో అ త్యంత ఓర్పు, సహనం, శక్తి ఉన్నవాళ్లు మహిళలేనన్నారు. గ్రామ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ సర్వే లు, సంక్షేమ పథకాలు పంపిణీ సహా అన్ని పనులూ కేవలం అంగ న్వాడీలే చేస్తన్నారన్నారు. అలాంటిది వాళ్ళ కనీస డిమాండ్లను నెరవేర్చకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు. మూడుసార్లు చర్చలకు పిలిచి అసం పూర్తిగా వదిలేయడం ప్రభుత్వం చేతకాని తనానికి నిదర్శనమన్నారు. ఈ రాక్షస పాలన లో ఏ ఒక్క ప్రభుత్వ విభాగం కూడా సంతృప్తి గా లేవని, నాలుగున్నరేళ్ళ కాలం లో హామీ లు అన్ని తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి టిడిపి నాయకులు భాస్కర్, మహేష్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొ న్నారు.