విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు


Ens Balu
43
Paderu
2024-01-18 14:26:51

 విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పాడేరు ఐటిడిఏ పీఓ వి. అభిషేక్ హెచ్చరించారు. మండలంలోని ఈదుల పాలెం ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రి రికార్డులు, హాజరు పట్టికలను పరిశీలించారు. పి.హెచ్.సి. వైద్యాధికారులు ఇద్దరు విధులకు హాజరు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. డా.పి. శ్రీను, డా. ఎం.నరసింహలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. ఒపి రిజిష్టరును తనిఖీ చేసారు. మందుల నిల్వలపై ఆరా తీసారు. పి.హెచ్.సి పరిధిలో ఉన్న గర్భవతులు ఎంతమంది ఉన్నారని వైద్య సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. గర్భవతులకు రెగ్యులర్గా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రసవ సమయానికి వారం రోజుల ముందుగా ఆసుపత్రి చేర్పించి సుఖ ప్రసవం జరిగేలా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది గిరిజనుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు.ఈనెల 22 న 300 సెల్ టవర్లు ప్రారంభం ఈనెల 22 వ తేదీన 300 మొబైల్ టవర్లను ముఖ్యమంత్రి పర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని ప్రాజెక్టు అధికారి చెప్పారు. పాడేరు మండలం ఈదుల పాలెం, డుంబ్రిగుడ మండలంలో ముఖ్యమంత్రి పర్చువల్ గా ప్రారంభిస్తారని చెప్పారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సభ ఏర్పాటు స్థలం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ డి. వి. ఆర్. ఎం. రాజు, డి. ఇ అనుదీప్, రిలయన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.