ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసిహారావు చెప్పారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో ఈ అంశంపై, ఏఈఆర్వోలు, వివిధ వర్గాల ప్రతినిధులతో ఆయన గురువారం సాయంత్రం సమావేశ మయ్యారు. ఓటు విలువను ప్రజలకు తెలియజెప్పడం, ఓటు హక్కును వినియోగించుకోవడం వంటి అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజెప్పేలా వివిధ అంశాలపై వ్యాసరచన, వక్తృత్వ, షార్ట్‌ఫిల్మ్ పోటీలను కూడా నిర్వహిస్తు న్నామ న్నారు. ఇందులో భాగంగా 25వ తేదీన వివేకానంద పార్కు నుంచి పీఆర్ కళాశాల వరకు ఓటర్ వాక్ నిర్వహించనున్నట్టు కమిషనర్ చెప్పారు. అనంతరం పీఆర్ కళాశా లలో జరిగే జాతీయ ఓటర్ దినోత్సవంలో వివిధ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానం చేస్తామన్నారు. సీనియర్ ఓటర్లను సన్మానించడం, యువ ఓటర్లు, కొత్త ఓటర్లుకు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తామన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా తో పాటు పలువురు అధికారులు,విద్యార్థులు పాల్గొంటారన్నారు. ఓటరు దినోత్సవం కార్యక్రమానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఆర్వోలు సీతాపతిరావు, వరహాలయ్య, హరిదాసు, నాగశాస్త్రులు, జాన్‌బాబు, మురళికృష్ణ, మేనేజర్ కర్రి సత్యనారాయణ, టీపీఆర్వో మానే కృష్ణమోహన్, యూని వర్సిటీ ఆఫ్ డెమోక్రసీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జి.అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.