మునగపాకలో గౌరీపరమేశ్వరుల ఉత్సవానికి భారీ ఏర్పాట్లు
P.Joginaidu
43
Munagapaka
2024-01-31 18:18:10
అనకాపల్లి జిల్లా మునగపాకలోని శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఫిబ్రవరి 3 న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పెంటకోట ఆదినారాయణ, ఆడారి అప్పలనాయుడు తెలిపారు.బుధవారం ఈ మేరకు గ్రామం లో సారె ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.కొబ్బరి బొండాలు, చెరకు గడలు,కొత్త పంటలు ఎడ్లు బండి పై ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం తో పాటు, వివిధ రకాల స్వీట్స్, పిండి వంటకాలు తో పెద్ద ఎత్తున మహిళలు ఊరేగింపు లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహోత్సవం లో భారీ స్టేజ్ ప్రొగ్రాం లు , నేల వేషాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది. గత ఏడాది కంటే ఈ ఏడాది మునగపాక లో ఫిబ్రవరి 3 న గౌరీ పరమేశ్వరుల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ తెలియజేసింది. ఉత్సవానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసినట్టు నిర్వాహకులు స్పష్టం చేశారు.