నిర్ణీత సమయం లో ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కారించాలని జివిఎంసి అధికారులకు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, జివిఎంసి అదనపు కమీషనర్ కె.ఎస్.విశ్వనాధన్ ఆదేశించారు. సోమవారం ఆమె జివిఎంసి ప్రధాన కార్యలయం లో జరిగిన డయిల్ యువర్ మేయర్, జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమము లో పాల్గొని ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్బముగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డయిల్ యువర్ మేయర్ కు 13, జగనన్నకు చెబుదాం కు 96 ఆర్జీలు వచ్చాయన్నారు. అందులో డయిల్ యువర్ మేయర్ కార్యక్రమములో ఇంజినీరింగు విభాగానికు 05, పట్టణ ప్రణాళిక విభాగానికు 02, ప్రజారోగ్య విభాగానికి 01, మొక్కల విభాగానికి 01, పిడి(యుసిడి) విభాగానికి 04 వచ్చాయని తెలిపారు. అలాగే జగనన్నకు చెబుదాం కార్యక్రమములో 2వ జోన్ కు 17, 3వ జోన్ కు 17, 4వ జోన్ కు 10, 5వ జోన్ కు 09, 6జోను కు 20, 8వ జోన్ కు 15, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 08 ఫిర్యాదులు అందాయిని.. అలాగే పరిపాలనా విభాగానికి 01, రెవెన్యూ విభాగానికి 09, ప్రజారోగ్య విభాగానికి 07, పట్టణ ప్రణాళిక విభాగానికి 29, ఇంజినీరింగ్ విభాగానికి 34, హార్టికల్చర్ విభాగానికి 02, యుసిడి విభాగానికి 14 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన మేయరు మాట్లాడుతూ సంబంధిత అధికారులు మూడు రోజుల్లో లేదా నిర్ణీత సమయంలో ఆర్జీలను పరిష్కరించాలని, వచ్చేవారానికి నివేదికలు సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు, ప్రధాన ఇంజినీరు రవి క్రిష్ణం రాజు, ఎగ్జామీనర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, ఎఫ్.ఎ & ఎ.ఓ మల్లికాంబ, అన్ని జోన్ల పర్యవేక్షక ఇంజినీర్లు, డిపిఓ చంద్రిక, ఇన్ చార్జి డిడిహెచ్ చక్రవర్తి, ఎసిపి శ్రీలక్ష్మి, యుసిడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.