ప్రతీ వివాహం ముందస్తు నమోదు జరిగేలా సహకరించాలి


P.Joginaidu
21
Anakapalle
2024-02-13 15:02:00

బాల్య వివాహాలు నిర్మూలనకు రాష్ట్రంలో జరిగే ప్రతీ వివాహానికి సంభందించిన వివరాలు ముందస్తుగా నమోదు జరిగేందుకు అధికారులు సహకరించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సిపిసిఆర్) చైర్ పర్సన్ కేసలి అప్పారావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ సిఫారసులు చేయనున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం తెలిపారు.అనకాపల్లి జిల్లా స్త్రీ,శిశు  సంక్షేమ శాఖ ప్రోజెక్ట్ డైరెక్టర్ అనంత లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన బేటీ బచావో బేటీ పడావో అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  జిల్లా చైల్డ్ వెల్ఫేర్ పోలీసు అధికారులు,పోలీసు స్టేషన్ల హౌస్ ఆఫీసర్లకు బాల్య వివాహాలు నిలుపుద లలో పోలీసుల పాత్ర,ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ బాలల సంక్షేమ కార్యక్రమాలు,చట్టాలపై అవగాహన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాహాలు ముందస్తు నమోదు ద్వారా బాల్య వివాహాలు అరికట్టేందుకు ఆస్కారం వుంటుందన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన వివరాల ప్రకారం వదువు, వరుడి వయ స్సులను కూడా నిర్ధారించ వచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొబేషనరీ అధికారి ఎం.శరత్ బాబు, ఉమ్మడి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, ఎన్ హెచ్ ఎం జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ బి.లూసీ కార్డులియా,జిల్లా లోని 33 పోలీసు స్టేషన్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు,సబ్ ఇన్స్పెక్టర్ లు పాల్గొన్నారు.