అట్టహాసంగా నాగాపురం రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన


Ens Balu
85
Golugonda
2024-02-15 06:26:11

గొలుగొండ
మండలంలోని నాగాపురం  రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. యలమంచిలి శ్రీనివాస వెంకట రమణారావు, రాజరాజేశ్వరి దంపతుల చేతులమీదుగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇక్కడి పాత ఆలయం ఉన్నచోటే రూ.20 లక్షలకు పైబడి అంచనా ఖర్చుతో నూతన హంగులతో కొత్త దేవాలయం పునర్నిర్మాణానికి గ్రామస్తులంతా ఏకమై ఈ బృహత్ కార్యక్రమానికి పూనుకున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 8.56 గంటలకు   పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ యలమంచిలి రఘురామ చంద్రరావు మాట్లాడుతూ పాత ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారికి దరఖాస్తు చేసుకున్నామన్నారు. వారు పెద్ద మనసుతో రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. దాతల నుంచి కూడా విరాళాలు సేకరిస్తున్నామని, అలా తోచినంత సాయం అందించానుకునేవారు 9492339941 నెంబర్లో సంప్రదించాలని కోరారు.