మిలాన్ ఏర్పాట్లను నిరంతరం పరిశీలించండి..జీవీఎంసీ కమిషనర్


Ens Balu
21
Visakhapatnam
2024-02-19 12:40:05


విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుచున్న మిలాన్ 2024 కార్యక్రమాలలో ఎటువంటి ఆటంకాలుఅవాంతరాలు కలగకుండా నిరంతరం పరిశీలిస్తూ పర్యవేక్షించాలని అధికారులను జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం ఆయన జీవీఎంసీ అదనపు కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తో కలిసి ఆర్.కె. బీచ్ రోడ్ లో మిలాన్ 2024 కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా బీచ్ రోడ్ విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ నుండి నోవాటల్ పరిసర ప్రాంతాల వరకు సందర్శించి,  మిలాన్ ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లనుసందర్శకుల కోసం ఏర్పాటుచేసిన గ్యాలరీలను పరిశీలించారు. నేటి నుండి మిలన్ కార్యక్రమాలు జరుగుతున్నందున సందర్శకులు అధిక సంఖ్యలో బీచ్ ప్రాంతాలకు వస్తారనిఏర్పాట్లలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

 

 బీచ్ నందు పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలనిసెంట్రల్ మీడియన్ లలో మొక్కలను అందంగా తీర్చిదిద్దాలనిబీచ్ నందు అన్ని సోలార్ లైట్లనుసీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలనివీక్షకుల కోసం పలుచోట్ల ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయాలనిఅవసరమైన చోట త్రాగునీటిని ఏర్పాటు చేయాలనికార్యక్రమంలో సందర్శకులకువీక్షకులకురవాణా సౌకర్యానికి ఆటంకం కలగకుండా సర్వీస్ రోడ్లలో వున్న వ్యాపార బండ్లను తాత్కాలికంగా తొలగించాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజనీర్లు కేవిఎన్.రవిసత్యనారాయణ రాజుజోనల్ కమిషనర్ విజయలక్ష్మిప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్,  డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం.దామోదర రావుచీఫ్ సిటీ ప్లానర్ సురేష్ కుమార్కార్యనిర్వాక ఇంజనీర్ రత్నాకర్ రెడ్డిఏసీపీలుఎ ఏం ఓ హెచ్ లు  తదితరులు పాల్గొన్నారు.