మీలో ఒక్కడిగా తనను ఆదరించి మద్దుతు తెలియజేయాలని వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కోరారు. మంగళవారం ప్రత్తిపాడు నియోజవకర్గ పరిధిలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం తనను గుర్తించి మళ్లీ మీఅందరికీ సేవచేసుకునే అవకాశం ఇచ్చిందని.. ఆ విషయాన్ని మీడియాకి తెలియజేయడంతోపాటు, అందరినీ ఒకేసారి కలిసే అవకాశం వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో పనిచేస్తున్న విలేఖరుల అపరిష్క్రుత సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. సాధ్యమైనంత వరకూ అన్ని సమస్యలను పరిష్కరానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉన్నమీకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించవచ్చునన్నారు. మధ్యలో ఎలాంటి మీడియేటర్లు, ప్రజాప్రతినిధులు ఉండరనీ చెప్పారు. పార్టీ అభివృద్ధి తాను చేయబోయే కార్యక్రమాలకు మీడియా సహకారం చాలా అవసరమని చెప్పారు. తనకి మీడియాలో పనిచేసేవారంతా ఒక్కటేనని, అందులో చిన్నా, పెద్దా తారతమ్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఉన్నది ఉన్నట్టుగానే రాయాలని, అభిృద్ధి కోణంలో కూడా మీడియా వాస్తవాలు రాయాలన్నారు. లేనిపోని విషయాలు కల్పితాలు రాయడం వలన ప్రయోజనం ఏమీ ఉండదనే విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరుపులతోపాటు జెడ్పీటిసి, ఎంపీటిసిలు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.