విశాఖ జనసేనలోకి యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. విశాఖలోని బీజేపిలోని ఓబీసీ పార్లమెంట్ సెక్రటరీగా తూర్పుని యోజకవర్గం సోషల్ మీడియా కో-కన్వీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తన్న బమ్మిడి ఎల్లాజీ ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. ఈయన విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం అడాప్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఈ సామాజిక వర్గంలో ఈయనకు మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. జనసేనలోకి వంశీక్రిష్ణ శ్రీనివాస్ చేరిన తరువాత, సదరు సామాజిక వర్గం అంతా ఆలోచనలో పడినట్టు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఒక్క తూర్పునియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బమ్మిడికి మంచి ఫాలోయింగ్. ఇలా నెట్వర్క్ ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా జనసేన తీర్ధం పుచ్చుకోవడం విశాఖలో ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈయన చేరిక తరువాత మరిన్ని చేరకలు జరుగే అవకాశముంది.