సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి విశాఖ నగర పర్యటన సందర్భంగా పారిశుధ్యం, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సీఎం విశాఖ నగరానికి విచ్చేయుచున్న సందర్భంగా ఎన్టీఆర్ జంక్షన్ నుండి చిన్న ముసిడివాడ శారద పీఠం వరకు పారిశుద్ధ్య పనులను, సుందరీకరణ పనులను అదనపు కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ తో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులతో పాటు రోడ్లు మరమ్మత్తులు పనులు, ఆకర్షణీయమైన మొక్కలతో సెంటర్ మీడియన్ లను ఆకర్షణీ యంగా తీర్చిదిద్దాలని, వీధి దీపాల నిర్వహణ, ఫుట్ పాత్ లు, పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టి పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్ కుమార్, పట్టణ ప్రణాళిక అధికారి సురేష్ కుమార్, ఎస్.ఇ రామమోహన్ రావు, జోనల్ కమీషనర్ హేమావతి, డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎం.దామోదరరావు పాల్గొన్నారు.