వేడెక్కుతున్న విశాఖ రాజకీయం..!


Ens Balu
295
vizag
2024-03-04 06:28:01

విశాఖలో రాజకీయం వేడెక్కుతుంది..అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టిడిపీలతోపాటు కాంగ్రెస్, బీజేపీలు, ఇతర వామపక్ష పార్టీలు సైతం ఇంకా అభ్యర్ధులను ఖరా రు చే యలేదు. అందరికీ పార్టీలు హామీలు మాత్రమే ఇచ్చాయి. వైఎస్సార్సీపీ అయితే ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో దఫదఫాలుగా అభ్యర్ధులను మారుస్తూ వస్తోంది. దీనితో ఎవరికి సీటు వస్తుందో..ఎవరి ఆశలు ఆవిరైపోతాయో..ఆ బాధతో ఎవరు ఏ పార్టీలోకి జంప్ అయిపోతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆర్ధిక బలం, కులబలం, అండ బలం ఉన్న అభ్యర్ధులను, ఖచ్చితంగా గెలిచే వారిని మాత్రమే ఈసారి రంగంలోకి దించాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. దీనితో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. ఉమ్మడి విశాఖజిల్లాలోని దాదాపుగా ఒకటి రెండు స్థానాలు తప్పితే మిగిలన అన్ని స్థానాలు, విశాఖనగరంలోని నాలుగు స్థానాలు, ఒక ఎంపీ పరిస్థితి కూడా సీటు తేలని అభ్యర్ధిత్వంగానే ఉండిపోయింది. సీట్లు ఆశిస్తున్నవారికి సీటు వస్తుందనే గ్యారెంటీ ఎక్కడా కనిపించడం లేదు. తెగించి వారు పోటీచేసే స్థానాల్లో కార్యక్రమాలు చేసుకుందామన్నా..ఆర్ధికంగా వెనుకబడిపోవడం తప్పితే మరేదీలేదని అభ్యర్ధులు కూడా వారి సీటుకి గ్యారెంటీ వచ్చిన తరువాత మాత్రమే ఖర్చుచేసుకోవాలని ధీమాగా ఉన్నారు. కొందరు ఆశావాహులు పార్టీ కేంద్ర కార్యాలచాల చుట్టూ సీటు కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. 

2024 సాధరణ ఎన్నికలు ఈసారి అన్ని రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ప్రభుత్వం తీరును కూడా ప్రజలు కూడా పూర్తిగా అర్ధం చేసుకోవడంతో ఆచితూచి అభ్యర్ధులను ఎంపికలు చేస్తున్నారు. ఆర్ధిక బలం ఉన్నంత మాత్రాన సీటు వచ్చే పరిస్థితి పోయింది. ప్రస్తుతం కుల రాజకీయాలు బలంగా ఉన్నందున ఎక్కు ఓటు బ్యాంకు ఏ సామాజిక వర్గంలో అయితే ఉంటుందో అక్కడ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను నిలబెట్టేందుకు రాజకీయపార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఒక్క ఎమ్మెల్యే స్థానానికే 50 నుంచి 75 కోట్ల రూపాయలు ఖర్చు చేసే బడా బడా నేతలనే పార్టీలు కూడా ఎంపిక చేస్తున్నాయి. దానికి తోడు వివిధ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు చేపట్టిన సర్వేల ఆధారంగా కూడా అభ్యర్ధుల ఎంపికలు జరుగుతున్నాయి. రాజకీయపార్టీల దగ్గర తమ బలాన్ని ప్రదర్శించి పార్టీలు మారిపోయినా..వారికున్న పలుకుబడి, పేరు ప్రఖ్యాతలు, ఆర్ధిక బలం ఆధారంగా మాత్రమే ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే విషయంలో అధిష్టానాలు ఆలోచిస్తున్నాయి. దానికి అనుగుణంగానే పార్టీకోసం బాగా పనిచేసిన వారు, ఆపై అన్ని విధాలా పార్టీ పెట్టిన నియమ నిబంధనలు అనుసరించే వారినే ఎంపిక చేయాలని చూస్తున్నా..ప్రధాన పార్టీలు సీట్లు పంపకం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఓటుకి రూ.500 రేటు పలికితే ఈసారి రూ.2వేల నుంచి 3వేలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్థాయిలో ఓటు బ్యాంకుని బట్టి ఖర్చు భరించే నాయకులను కూడా పార్టీలు సమాయాత్తం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవసరం అనుకుంటే ఓటుకి రూ.5వేలు ఇచ్చైనా అధికారంలోకి రావాలనే గట్టి పట్టుదలతో ప్రధాన పార్టీలు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. దానికోసమే ప్రత్యేక కార్యాచరణలు కూడా చేసుకుంటున్నారనే వాదన బలంగా తెరమీదకు వస్తున్నది. ప్రభుత్వం అధికారికంగా కులగణన చేపట్టనప్పటికీ, ప్రభుత్వం అందచేసిన సంక్షేమ పథకాల ఆధారంగా, కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్న సమావేశాలు, లెక్కింపును బట్టి ఖర్చు చేయాలని చూస్తున్నారని సమాచారం అందుతోంది. సామాజిక వర్గాన్ని బట్టి ఖర్చు చేయడానికి, వారికి అభివృద్ధి ఫలాలు అందించడానికి, నామినేటెడ్ పదువులు ఇవ్వడానికి, ఇతర సదుపాయాలు కల్పించడానికి అప్పుడే ఆఫర్లుకూడా ఇచ్చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రప్రభుత్వంలోని అన్ని శాఖలు, ఇతర ప్రధాన అంశాల్లో ఎన్ని నామినేటెడ్ పదవులుంటే అన్నింటినీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న సామాజిక వర్గాలకు ఇవ్వడానికి కూడా ముందుగానే ఒప్పందాలు కుదిరాయని చెబుతున్నారు. ఎల్లప్పుడూ తాము పనిచేస్తే ఓట్లు వేయించుకొని మీరు అధికారం వెలగబెడితే మేము ఏమైపోవాలనే వాదన, స్థానికులను కాదని నాన్ లోకల్ వారిని తెరమీదకు తీసుకువచ్చి స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్తుకు మంగళం పాడే విధానాలను సైతం బలంగా తిప్పికొడుతున్నారు. పక్కా లోకల్ అనే వాయిస్ ని బలంగా తేవడంతో విశాఖజిల్లాతో టు నియోజకవర్గాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అంతా అనుకూలిస్తే మార్చి 10వ తేదీలోపు సీట్లు సర్ధుబాటు అవుతుందని చెబుతున్నారు. చూడాలి విశాఖ రాజకీయ చట్రంలో సామాజిక, ఆర్ధిక, అండ బలంతో సీట్లు పొంది బరిలో నిలిచేదెవరో..!