లంకెలపాలెం జంక్షన్.. నిత్యం నరకం..!


PSVK.Viswanadham
40
lankelapalem
2024-03-06 11:01:34

ఆ జంక్షన్ వచ్చిందంటే ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి నాలుగు చక్రాల వాహన దారుల వరకూ కంగారు పడాల్సిందే. కళ్లముందు రోడ్డు మొత్తం అధ్వాన్నంగా మారి ఎత్తుపల్లాలు, అతుకులు బొతులుకులుగా ఉన్నా దీనిని పట్టించుకునే వారే కరువయ్యారు. అందునా సిగ్నల్ పాయింట్ కూడా కావడంతో వాహనాదారులు అస్థవ్యస్థంగా ఉన్న రోడ్డుతో నరకం చూడాల్సి వస్తుంది. లంకెలపాలెం జంక్షన్ నాలుగు రోడ్ల కూడలి అత్యంత దారుణంగా తయారైంది. ఈ జంక్షన్ నుంచి పరవాడ ఫార్మాసిటీ వెళ్లాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. దీనితో వాహనాలు మరమ్మత్తులకు గురవుతున్నాయి. ఫార్మాసిటీకి ఉద్యోగులు, స్థానికులు, వాహనదారులు నిత్యం తిరిగే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం రోడ్డు పడిగిలిపోయి పిక్క బయటకు తేలిన ప్రదేశాల్లో సైతం ప్చాచ్ వర్క్ చేయడం లేదంటే పరిస్థితి ఎంతలా ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఈ రోడ్డులో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నా..ఈ రోడ్డుకి మాత్రం మోక్షం రాలేదు. అసలే రోడ్డు బాగాలేక ఇబ్బందులు పడుతుంటే.. ఎన్టీపీసీకి వెళ్లే భారీ వాహనముల (బొగ్గు, ప్లై యాష్) లారీల వలన దుమ్ము కాలుష్యం తో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తక్షణమే ఎన్టీపీసీ యాజమాన్యం సిఎస్ఆర్ నిధులతో మరమ్మత్తులు చేయాలని లేదంటే ఆందోళన చేపడతామని లంకెలపాలెం ప్రజలు హెచ్చరిస్తున్నారు. జంక్షన్ రోడ్డంతా పాడైపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం వలన వాహనాల దూళి మొత్తం ఇళ్లల్లోకి వస్తుందని ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాల్లో పెద్ద ఎత్తున దూళి రావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. దూళి రేగ కుండా ప్రతిరోజు వాటర్ స్ప్రింగ్లింగ్ చేసేవారని ఇప్పుడు అది కూడా మానేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీరు చల్లితే దూళి ఎగరకుండా వుంటుందని..అలా చేయకపోవడం వలన గృహ సము దాయాలు సైతం దుమ్ముదూళితో నిండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీపీసి యాజమాన్యం కానీ, ఆర్అండ్బీ కానీ పట్టించుకోకపోతే ఈ మార్గంలో వాహనాలు తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.