స్థానిక సత్యలక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ భీశెట్టి వరాహ సత్యవతి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గొర్లి సూరిబాబు , కె.కోటపాడు జెడ్పీటిసి అనురాధ, మహిళా శిశు సంక్షేమ శాఖ జేడీ చిన్మయి దేవి , ఏఎస్సై మణి కుమారి, నర్సీపట్నం జెడ్పీటీసీ కుసుమ, అనకాపల్లి జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ల సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడి వర్కర్లు, వివిధ గ్రామాల మహిళా సర్పంచులు, మహిళా సభ్యులు జెడ్పిటిసిలు, కె. అనంతలక్ష్మి ,పిడి మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.పిడి ఆఫీస్ సిబ్బంది, అనకాపల్లి జిల్లాలో గల బెస్ట్ వర్కర్స్ కు అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.