అరకు ‘గీత’ పైనే ఆశలు..!


Ens Balu
27
araku
2024-04-02 19:06:40

అల్లూరి మన్యం వాసుల స్థితిగతులు మారాలంటే ఉన్నత చదువు, అపారమైన పరిపాలన అనుభవం, ప్రజల్లోకి చొచ్చుకుపోయే స్వభావం, అన్నింటికీ మించి గిరిపు పుత్రులను అక్కున చేర్చుకునే గుణం, కేంద్ర ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రస్తుతం అవన్నీ ఇపుడు అరకు ఎంపీ అభ్యర్ధి కొత్తపల్లిగీతలో కనిపిస్తు న్నాయంటున్నారు ఏజెన్సీ వాసులు. విభజన జిల్లాల్లో మొత్తం గిరిప్రాంతంగా వున్న జిల్లా అభివృద్ధి చెందాలంటే దానికి కేంద్రప్రభుత్వ సహాయం ఎంతో అవసరం. అందునా ఐటీడిఏలు ఉన్న ప్రదేశం అయితే నిధుల సమీకరణకు కూడా మార్గం సుగమం అవుతుంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో మంచి పరిచియాలు ఉన్న వ్యక్తులైతేనే సరిగ్గా అరకు పార్లమెంట్ ప్రాంతం, అల్లూరి పాడేరు జిల్లా పూర్తిస్థాయిలో అభిృద్ధి చెందడానికి ఆస్కారం వుంటుంది. ఇప్పటికే ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి మరోసారి బరిలోకి దిగుతున్న కూటమి అభ్యర్ధి కొత్తపల్లి గీతపై మన్యం వాసులు చాలా ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రాంతీయులు. సాధారణంగా పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీలుగా గెలిచిన వారంతా రాజకీయపార్టీలకు ప్రతినిధులుగా ఉన్నారు తప్పితే ఇక్కడ పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించే స్థాయిలో పనిచేయలేదనే అంశాన్ని గిరిపుత్రులే గగ్గోలు పెట్టి మరీ చెబుతుంటారు. అలాంటి సందర్భంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనూ, నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతోనూ మంచి సత్సంబంధాలు కలిగిన అభ్యర్ధి కొత్తపల్లి గీత. ఆమెను అరకు పార్లమెంటు స్థానం నుంచి ఢిల్లీకి పంపితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, కొత్తజిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుందనేది ఇపుడు తెరపైకి వచ్చిన అంశం. ఇప్పటి వరకూ అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఇంత పెద్ద స్థాయిలో పరిచియాలు, సత్సంబంధాలు ఉన్నవారు ఎవరూ లేరు. ఆ విషయంలో కొత్తపల్లి గీతనే ప్రపధమంగా ముందు వరుసలో నిలుచున్నారు.

స్వతహాగా గ్రూప్-1 అధికారిణిగా పనిచేసిన అనుభవం ఉన్నఈమెకు కేంద్రప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలపైనా, రాష్ట్రప్రభుత్వంలోని పరిపాలనపైనా విశేష అనుభ వం వుంది. రాజకీయంలో ప్రజాప్రతినిధిగా నిలబడాలంటే డబ్బుంటే పార్టీలు ఆధరిస్తాయి. కానీ ప్రభుత్వ అధికారులుగా, ఉన్నత చదువరిలుగా ఉన్నవారు కూడా రాజకీయాల్లో ఉంటూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో మంచి పరిచియాలు పెట్టుకుంటే మాత్రం వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలకు, జిల్లాను అభివృద్ధి 
చేయడానికి వీరికున్న మార్గాలు మరెవరకీ ఉండవు. అందులోనూ నేరుగా కేంద్రప్రభుత్వంతో మంచి పరిచియాలు, ఎలాంటి పనులనైనా నేరుగా కేంద్రప్రభుత్వం 
దగ్గరకు తీసుకెళ్లడంలో కొత్తపల్లి గీత ముందుంటారు. అంతేకాదు ఒక అధికారిగా తనకున్న అనుభవంతో సమస్యలు, అభివృద్ధి, ప్రభుత్వ సంస్థల అవసరంపై 
ప్రభుత్వానికి నివేదించడంలోనూ ఈమెది అందెవేసిన చేయి. రాజకీయ నాయకుల్లో అయితే డబ్బున్నవారు..లేదంటే సామాజిక బలం ఉన్నవారు ఎక్కువగా 
ఉంటారు. కానీ ఈమె విషయంలో సామాజిక బలం, ప్రభుత్వ అధికారిణిగా పనిచేసిన అనుభవం, పరిపాలనపై పట్టు, కేంద్రంలోని మంత్రులతో మంచి పరిచయాలు, 

ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై అవగాహన చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా  ఉన్నవారు ప్రస్తుత రాజకీయ పార్టీల్లో వేళ్లపై లెక్కపెట్టేంత తక్కువగా 
ఉన్నారు. ప్రస్తుతం కొత్త జిల్లాలు అభివృద్ధి చెందాలన్నా, విభజన ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం జరగాలన్నా రాష్ట్రం నుంచి ఒక ఉన్నత చదువరి ఎంపీ ఒక్కరు 
ఉంటే వాటి ఫలితాలు కూడా వేగంగా వచ్చే అవకాశం చాలా వుంది.ప్రస్తుతం కొత్తపల్లి గీత అరకు పార్లమెంటు నియోజకవర్గంలో గెలిస్తే..ఒక్క తన పార్లమెంటు నియోజకవర్గానికే కాకుండా.. యావత్ రాష్ట్రానికే ఉపయోగపడే ఏకైక ఎంపీగా అవతరించనున్నారు. ఏపీలో విభజించిన కొత్త జిల్లాలకు రాష్ట్ర పతి ఆమోదాన్ని కూడా తేవడంలో ఈమె కీలకంగా వ్యహరించగలరంటే అతిశయోక్తి కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే రాష్ట్రంలో 26 జిల్లాలు లెక్క. కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో విభజన ఆంధ్రప్రదేశ్ లో కేవలం 13 జిల్లాలు మాత్రమే. ఈ జిల్లాలను రాష్ట్రప్రభుత్వం 26 జిల్లాలు చేసి స్టేట్ గెజిట్ విడుదల చేసింది తప్పితే..కేంద్రం ఇంకా కొత్త జిల్లాలకు ఆమోదం తెలుపలేదు. ఎప్పుడైతే కేంద్రం కొత్త జిల్లాలకు ఆమోదం తెలుపుతుందో అప్పుడే కొత్త జిల్లాలకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థలు, అభివృద్ధి జరుగుతుంది.

ఇక్కడ మీకు అనుమానం రావొచ్చు.. రాష్ట్రప్రభుత్వ సహకారం లేకుండా, ప్రాతినిధ్యం లేకుండా ఒక ఎంపీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం చేగలరని..? అవును..కేవలం ఎంపీలు.. అందునా కూటమి తరుపున గెలిచిన ఎంపీలు మాత్రమే కేంద్రం నుంచి పనులు చేయించడానికి అవసరం అవుతారు. అంతేకాదు విభజన రాష్ట్ర సమస్యలను పార్లమెంటులో గళమెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా వీరే చేయాలి. చాలా రాజకీయపార్టీలు వారి పార్టీ తరపున ఎంపీలుగా డిల్లీకి ఎంపీలను పంపినా వారికి హిందీ రాక, ఇంగ్లీషు అంతకంటే రాక, అక్కడ మాట్లాడే బాష తెలీక చాలా మంది ఎంపీలు పార్లమెంటులో చక్కగా కునుకుతీసి బయటకి వచ్చేవారే అధికం. కాదూ 
కూడదు అనుకుంటే అప్పుడప్పుడూ పలు కేంద్రం మంత్రులకు మాత్రం వారి లెటర్ హెడ్ పై వినతులు మాత్రం అందిస్తుంటారు.  ఆంధ్రప్రదేశ్ లోనూ, వారు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు నియోజకవర్గాల సమస్యలను, జిల్లాల్లోని ఇబ్బందులను పార్లటులో లేవనెత్తలేని పరిస్థితి. ఇలా ఎలాంటి అవగాహనలేని ఎంపీలు ఉన్నచోట ఉన్నత చదువులు చదివిన వారు, పలు బాషలపై పట్టున్నవారు, గ్రూప్-1, ఐఏఎస్ అధికారులుగా పనిచేసిన వారు ఎంపీలుగా ఢిల్లీకి వెళితే వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి.

ఖచ్చితంగా వీరికి పరిపాలనపై పట్టు వుంటుంది కాబట్టి కేంద్రానికి ఏ ఫార్మాట్ లో సదరు సమస్యను తెలియజేస్తే పనులు జరుగుతాయనేవిషయం ప్రభుత్వంలోని ఉన్నతాధికారులుగా పనిచేసిన వారికి తెలిసినట్టు మరెవరికీ తెలియదు.  కేంద్ర రాష్ట్రప్రభుత్వాల్లో మంచిపట్టు ఉంటే వారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు, రాష్ట్రాలకు కూడా ఎంతో మేలు జరగుతుంది అది పరిపాలనపై అనుభవం ఉన్నవారికి తప్పా మరెవరికీ తెలియదు. ఇపుదు అదే కోణంలో అరకు ఎంపీగా కొత్తపల్లి గీత కూడా మరోసారి అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి అభ్యర్ధులను గెలిపించుకోవడం ద్వారా అటు కూటమి, ఇటు నియోజకవర్గానికి రాష్ట్రానికి కూడా ఎంతో మేలు జరుగుతుందనేది వేరేగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఇపుడు ఆరకు పార్లమెంటు నియోజకర్గం గిరిజనం అంతా గీతపైనే ఆశలు పెట్టుకున్నారు..!