మామ..కోడలు.. ఒక ఎంపీ సీటు..?!


Ens Balu
44
araku
2024-04-09 03:43:05

అలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనే నానుడి వెనకటిది.. కానీ ఇపుడు మామ.. కోడలు ..ఒక ఎంపీ సీటు అంటున్నారు మన్యం వాసులు.. అదేంటి ఈ రెండిటికీ తేడా ఉంది కదా అనుకోవచ్చు. నిజమే తేడా ఉంది.. గెలుపు గుర్రాలను కాదని ఇపుడు వెనుకంజలో ఉన్న అభ్యర్ధికి ఎంపీ సీటు కేటాయించడం పట్ల సొంత పార్టీలోనే ముసలం మొదలైంది. ఎక్కడికి వెళ్లినా తిరుగుబాటు ఎదురవుతుంది. అరకు ఎంపీ సీటు చుట్టూ రాజకీయం రక రకాలు గా తిరుగుతుందనే వాదన తెరపైకి వచ్చింది. దీనితో ఆఖరి నిమిషంలో.. అంటే బీ ఫారం ఇచ్చే లోగానైనా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. దానికి ప్రస్తుతం మన్యంలోని అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధినిలోని అసెంబ్లీ స్థానిలు, వాటి మండలాల్లో అతి పెద్ద చర్చ మొదలైంది. దానికి తోడు అధికారపార్టీ అభ్యర్ధి, వారి కుటుంబపై పెరుగు తున్న నిరసన, వ్యతిరేకత కూడా తోడవుతోంది. మామని కాదని కోడలకి ఎంపీ టిక్కెట్టు కేటాయించడం, సిట్టింగ్ ఎంపీని కాదని కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడం..ఇదే ప్రాంతంలో ఎంపీగా గెలవడానికి అత్యంత ఎక్కువ అవకాశాలు ఉన్న సమర్ధి భవాని పేరు చాలా స్ఫష్టంగా వినిపిస్తోంది. తొలుత అరకు ఎంపీ సీటు ఈమెకు ఖరారు అయిందని ప్రకటించే లోపే డా.గుమ్మతనూజారాణి వైఎస్సార్సీపీ ఖరారు చేసింది. 

అయితే అరకు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై గిరిజన సంఘాలు కారాలు మిరియాలూ నూరుతున్నారు. కనీసం గిరిజనుల కోసం ఏమీ చేయలేదని, పైగా 18 అవినీతి అంశాలతో కూడి కరపత్రం కూడా ఆదివాసీ సంఘాల జేఏసీ 2020లోనే ముద్రించి మన్యం అంతా పంచేసింది. నాటి నుంచి నేటి వరకూ చెట్టి కుటుంబాన్ని గిరిపుత్రులంతా దూరంగా పెడుతున్నారు. అయితే ఈసారి అధిష్టాం చెట్టి పాల్గుణను పక్కనపెట్టి ఆయన కోడలికి ఎంపీ సీటు కేటాయించడం  పట్ల గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేక ఎదురవుతున్నది. ఒకే కుటుంబంలోని వారికే అన్ని పదవులూ ఇచ్చే పార్టీ కోసం శ్రమించిన వారికి, నాటి నుంచి నేటి వరకూ అత్యధిక మొత్తంలో ఖర్చులు పెట్టి జెండాలు మోసిన వారికి కనీసం ప్రాధాన్యత ఇవ్వడం లేదని గిరిజనులు తిరగబడుతున్నారు. ఈక్రమంలో ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా మన్యంలో తిరుగుబాటు ఎదువుతుంది. ఏకంగా ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో గిరిజులు ఘెరావ్ చేశారు. అయినప్పటికీ నెట్వర్క్ పూర్తిస్థాయిలో నడపడంతో కోడలికి సీటు తెచ్చుకోవడంలో సఫలీకృతులు అయ్యారు. సమర్ధి భవానీ ఈమె కుటుంబం మొత్తం రాజకీయనేపథ్యం ఉన్నవారు కావడం, ఆర్దికంగా బలంగా ఉన్నవారైనప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో పార్టీలోని పెద్దలను మచ్చిక చేసుకొని ఎంపీసీటు తెచ్చుకోగలిగారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

 సీటు అంటే వచ్చింది తప్పితే గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తున్నది. దానికి సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవిని పక్కన పెట్టడం, ఈసారి ఎమ్మెల్యే కాకుండా ఎంపీ సీటు ఆశించిన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కూడా సీటు ఇవ్వకుండా ఒకే కుటుంబంలోని వారికి ఎంపీ సీటు కేటాయించడం వలన వారిద్దరి వర్గం, అనుచరులు వ్యతిరేకంగా చేస్తారని చెబుతున్నారు. దానితోపాటు ఇక్కడ గతంలో ఎంపీగా పనిచేసిన కొత్తపల్లి గీత కూడా ఈసారి ఎంపీ బరిలో ఉన్నారు. ఉమ్మడి అభ్యర్ధిగా బరిలో ఉన్నప్పటికీ ఆమె చుట్టూ కూడా పలు అవినీతి ఆరోపణలు ప్రదక్షిణలు చేస్తున్నాయి. దానితో ఆమె వాటికి  మీడియా ముఖంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అటు టిడిపిలో కూడా సరైన అభ్యర్ధిని ఎంపీగా సీటు కేటాయించకపోవడంతో..అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బలంగా వున్న సమర్ధి భవానీ పేరు కూడా తెరపైకి వచ్చింది. చాలాకాలం నుంచి ఈమె పేరు ఎంపీ అభ్యర్ధిగా అధిష్టం వద్ద ప్రస్తావనలో వుంది. ఈమెకు రాజకీయ నేపథ్యంతోపాటు ఈమె సామాజిక వర్గం వాల్మీకిలు అరకు పార్లమెంటు పరిధిలో అత్యధికులు ఉన్నారు. అలాగైనా ఈమెకు ఓటు బ్యాంకు బలంగా కనిపిస్తుంది. అందులోనూ ఈమె కుటుంబం కూడా కాస్త ఆర్ధికంగా బలంగా వుండటం, పంతంతో జరుగుతున్న ఈసారి ఎన్నికల్లో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు కూడా ఉండటంతో గెలుపు గుర్రాలను కాదని సీటు ఒకే కుటుంబంలోని వారికి ఇస్తే కావాలని ఓడించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

 ఈ కుటుంబానికి కూడా పార్టీలోని అధిష్టానంలోని పెద్దలతో చాలా గట్టి పరిచయాలే ఉన్నాయట. అయితే వైఎస్సార్సీపీ అధిష్టానం సీటు కేటాయించకపోతే ఇంటిపెండెంట్ గా నైనా తమ సామాజిక వర్గం బరిలోకి దించాలని చూస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు వచ్చినట్టు తెలిసింది. అదే జరిగితే జాతీయపార్టీలు సీటు భవానికీ కేటాయిస్తే అరకు పార్లమెంటు నియోజకవర్గానికి నిజమైన సమర్ధరాలు అన్నమాట బలంగా సామాజిక వర్గం, అక్కడి క్యాడర్ బాహాటంగానే ప్రకటిస్తున్నారు. అయితే పార్టీ గీసిన గీటు దాటకుండా ఉంటే గౌరవంగా ఉంటుందనే కోణంలో వీరి కుటుంబం ఎటూ ప్రకటన చేయకుండా స్థబ్దుగా ఉండిపోయింది. కానీ క్యాడర్ నుంచి, ఇతర అభిమానులు, కార్యకర్తల నుంచి వెంటనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఒత్తిడి అధికంగా ఉందట. చూడాలి గెలుపు గుర్రాల రేసులో తొలిస్థానంలో ఉన్న సమర్ధి భవాని కుటుంబం అరకు పార్లమెంటు సీటు విషయంలో ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే పై అవినీతి ఆరోపణలు కూడా ప్రస్తుతం మీడియాలో ప్పుమంటున్నాయి. ఈ తరుణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వేళ వైఎస్సార్సీపీ అధిష్టానం మనసు మార్చుకోకపోతే వీరు వేరే పార్టీ ఆహ్వానం తీసుకుంటే వార్ వన్ సైడ్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ఇక్కడి ఓటర్లు. చూడాలి అత్యంత ఉత్కంఠ రాజకీయ పరిణాలమాల మధ్య ఎలాంటి అడుగులు ముందుకు పడతాయనేది..?!