అరకు చుట్టూ ‘చెట్టి’అవినీతి ఆక్రమణలే..!


Ens Balu
64
araku vally
2024-04-12 02:46:38

గిరిజన ఎమ్మెల్యే అయిండి..గిరిజనుల భూములనే ఆక్రమించాడు.. అడిగినందుకు చంటిపిల్లల తల్లిని 72రోజులు జైలు పాలు చేశారు.. అధికారం అడ్డం పెట్టుకొని భారీ అవినీతికి పాల్పడ్డాడు.. గిరిజనులకు న్యాయం చేయపోగా అన్యాయంగా కేసులు పెట్టే ఎమ్మెల్యే, వారి కుటుంబం మాకొద్దంటూ అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టిపాల్గునపై బాధిత గిరిజనులు(భగతా సామాజిక వర్గం) చేస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇదిగో చెట్టి అవినీతి చిట్టా అంటూ ఆదివాసీ జేఏసి ఒక పెద్ద కరపత్రాన్నే అరకు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండలాల్లో ప్రచార అస్త్రానికి దించింది. సాధారణంగా గిరిజన ప్రాంతంలో ప్రజాప్రతినిధులంటే గిరిజనులకు మేలు చేసి, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చెస్తారు..కానీ తమను దోచుకోవడానికే చెట్టి పాల్గున ఎమ్మెల్యే అయ్యారని  చొక్కా పట్టుకొని అడంగండంటూ గిరిజనులు ఎమ్మెల్యేని గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో గెరావ్ చేసిన వీడియోలను ఇప్పుడు బాధిత గిరిజనులు అన్ని గ్రామాల ప్రజలకు బాధితులే వెళ్లి స్వయంగా వీడియోలను చూపించి గిరిజనులను చైతనపరుస్తున్నారట. ఐ ప్యాక్ సర్వే అంటూ గ్రౌండ్ లెవల్ రిపోర్టులు తీసుకొని మరీ టిక్కెట్లు ఇచ్చిన వైఎస్సార్సీపీకి ఇపుడు వైరల్ అవుతున్న వీడియోలు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. 

దీనితో అరకు ఎంపీగా , ఎమ్మెల్యేలుగా టిక్కెట్లు ఆశించి బంగపడిన పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గొడ్డేటి మాధవిలు సైతం ఈ ప్రచారాలను అడ్డుకోవడం లేదని, కనీసం అరకు ఎమ్మెల్యే వెనుక వున్న క్యాడర్ సైతం తిప్పికొట్టడం లేదని చెబుతున్నారు. మరోప్రక్క పార్టీ అధిష్టానం రేగం మత్స్యలింగానికి అరకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించినప్పికీ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యే జరుగుతున్న ప్రచారాలను తిప్పికొట్టకపోవడంతో ఇదంతా నిజమేనని గిరిజనులు భావించే పరిస్థితికి వచ్చారు. దగా పడ్డ గిరిజన కుటుంబాలు పనిగట్టుకొని మరీ చెట్టి పాల్గున కుటుంబానికి మద్దతు ఇవ్వొద్దని, ఇపుడు తమను జైలుపాలు చేసినట్టు మిగిలిన గిరిజనులను కూడా జైలు పాలు చేసి.. విలువైన భూములు ఆక్రమించేసుకుంటారని ఒక బృందంగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి మరీ తమకు జరిగిన అన్యాయంపై గిరిజనులు( మొత్తం అరకు పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో సుమారుగా ఉన్న 1.20 లక్షల మంది ఓటర్లు) చైతన్యం తీసుకు వస్తున్నారనే ప్రచారం ఇపుడు గుప్పుమంటున్నది. అందులోనూ టిక్కెట్టు ఆశించిన వారికి టిక్కెట్టు రాకపోగా..పార్టీ అభ్యర్ధి గెలవడానికి పనిచేసిన వారందికీ ఈ ఐదేళ్ల కాలంలో న్యాయం జరగకపోవడానికి కారణంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేనంటూ పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది.

 అయితే ఇదంతా తమకుటుంబంపై గిట్టనివారు అసత్య ప్రచారం చేస్తున్నారని, మీడియా కూడా తప్పుగానే చూపిస్తుందని దానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనే బేధం లేకుండా అందరూ తనపై అసత్య వార్తా కథనాలే ప్రచారం చేస్తున్నారని.. ఈ వీడియోలనే ఇపుడు కొందరు గిరిజనులు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారంటూ చెట్టి పాల్గొన కొట్టి పారేస్తున్నారు. అయితే తమ కుటుంబాన్ని జైలు పాలు చేశారంటూ బాధిత గిరిజనులు చెప్పిన మాటలు ఫేక్ అంటారా..? గిరిజనులను జైలు పాలు చేయలేదంటారా..? వారి భూములను ఆక్రమించుకోలేదంటారా..? ఆదివాసీ సంఘాల జేఏపి ఆరోపిస్తున్నట్టు కరపత్రంలో ముద్రించిన అంశాలు ఏ ఒక్కటీ నిజం కాదంటారా అంటే అవేమీ తనకు తెలీదు..తాను మాత్రం సత్యహరిశ్చంద్రవంశానికి చెందిన వాడినని..అందుకే సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పిలిచిమరీ మా కోడలు డా.గుమ్మ తనూజారాణికి పార్లమెంటు అభ్యర్ధిగా సీటు ఇచ్చారని ధీమా చెబుతున్నారు. పార్టీ చేసిన, ప్రస్తుతం చేయిస్తున్న సర్వేల్లో కూడా వాస్తవం ఉంటే తెలియాలికదా.. చాలా చోట్ల అభ్యర్ధులను మార్చినట్టుగా మమ్మల్నీ కూడా మార్చాలి కదా..? ఎందుకు మార్చడంలేదూ అంటే తమపై వచ్చిన్న ఆరోపణలన్నీ నిరాదారమైనవేనని అందుకే పార్టీ వాటిని కనీసం పట్టించుకోలేదని తనకు అనుకూలంగా ఉన్న క్యాడర్ కి గీతోపదేశం చేయడంతోపాటు ఇదే విషయాన్ని గిరిజనులకు తెలియజేయాలని, వారిని చైతన్య పరచాలని చెప్పిపంపిస్తున్నారట. 

ఇంత జరిగిన తరువాత..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాల్లో చెట్టి అవినీతి ఆరోపణలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న తరుణంలో ప్రస్తుతం సర్వేలు చేస్తున్న ఐప్యాక్ టీమ్ బృందం దృష్టికి ఇలాంటి అవినీతి ఆరోపణలు, టీవల్లో వచ్చిన వార్తా కధనాలు, పత్రిలకల్లో వచ్చిన వార్తలు, బాధితులే స్వయంగా మీడియా ముందుకి వచ్చి వీడియో ముఖం చెప్పిన అంశాలను పరిణగోలనికి రాకపోవడం ఇపుడు చర్చనీయాంశం అవుతున్నది. తొలుత అరకు ఎమ్మెల్యే అభ్యర్ధిగా గొడ్డేటి మాధవిని ప్రకటించి తరువాత దానిని రేగం మత్స్య లింగానికి ఇవ్వడం, ఆ తరువాత ఈయన విషయంలోనూ చెట్టి పాల్గొ వర్గం దూరం దూరంగా ఉండటం కూడా ప్రస్తుతం ఏజెన్సీలోని గిరిజనులను ఆయోమయ స్థితిని నెట్టేస్తున్నది. ఏజెన్సీలో రంగులు మారుతున్న రాజకీయం, ప్రస్తుత అభ్యర్ధులపై వైరల్ అవుతున్న అవినీతి ఆక్రమణల వీడియోలు బహుసా వైఎస్సార్సీపీ అధిష్టానం చూసి ఉండకపోవచ్చుననే వాదన కూడా వినిపిస్తుంది. లేదా చూసినా.. ముందుగా మాటిచ్చాం కనుక గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా అదేం పెద్ద మేటర్ కాదని, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్ధులను ఖచ్చితంగా గెలిపిస్తాయనే దైర్యమూ కావొచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంత అవునన్నా.. మరెంత కాదన్నా నిప్పులేకుండా పొగరాదు.. అన్యాయానికి గురికి కాకపోతే అమాయక గిరిజనులు(భగతాలు) మీడియా ముందుకివచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని పదే పదే చెప్పరు. ఇది కూడా ఫేక్, ఇంటెలి జెన్స్ కి దృష్టికి రాలేదంటే.. బాధిత గిరిజనులు, వీరికోసం తెలిసిన వేరే రకంగా ఖచ్చితంగా ఆలోచిస్తారనే ప్రచారమూ జరుగుతుంది. త్వరలోనే అభ్యర్ధులను ప్రకటించనున్న వైఎస్సార్సీపీ అధిష్టానం ప్రస్తుతం జరుగుతున్న అవినీతి ఆక్రమణల వ్యవహారాన్ని ఏవిధంగా స్వీకరించి అభ్యర్ధులను ప్రకటిస్తుందనేది ఆశక్తిగా మారింది..?!