మహా తిరుగుబాటు..!


Ens Balu
15
visakhapatnam
2024-07-22 03:47:22

మహ విశాఖ నగరపాలక సంస్థలోని కార్పోరేటర్లు వైఎస్సార్సీపికి చావు దెబ్బ కొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు ఓటుతో కొడితే..వీళ్లంతా నమ్మ కం తో కొట్టారు. పార్టీకోసం పనిచేసిన మాకు ఏం గుర్తింపు ఇచ్చారని..కనీసం ఒక్క పనైనా చేశారా అని ఓ దులుపు దులిపేసి మరీ హేండిచ్చే శారు. ప్రస్తుతానికి ఏడుగురు వైఎస్సార్పీపీ కార్పోరేటర్లు టిడిపిలోకి జంప్‌ చేయగా మరో ఐదుగురు జనసేనలోకి వెళ్లిపోవడానికి తమ మద్దతుని తెలియజేశారు. అధికారంలో ఉండగా కార్పోరేటర్ల ప్రభుత్వం సహాయ పడిఉండి ఉంటే నిజంగా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చాలా పథకా లు ఇచ్చేశాం..మరో పదేళ్లు మనమే అధికారంలో ఉండిపోతామనే ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో చేసిన పనులన్నీ ఎన్నికల తరువాత ఒక్కొక్కటిగా తిరిగి కొట్టే స్తున్నాయి. ఫలితంగా నేడు విశాఖలోని మేయర్‌ పీఠం వైఎస్సార్సీపి కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన దగ్గర నుంచి జివిఎంసీ మేయర్‌ పీఠం వదులుకోక తప్పదని ఎమ్మెల్యే వంశీక్రిష్ణ చేసి హెచ్చరిక కు నేటి కార్పోరేటర్ల జంపింగ్‌ తో క్లారిటీ వచ్చేసింది.

వాస్తవానికి వంశీని మేయర్‌ నిచేస్తామని చెప్పి కార్పోరేటర్‌ గా నిలబెట్టి ఆఖరి సమయంలో రాజకీయం చేసి అదే సామాజిక వర్గానికి చెందిన హరివెంకటకుమారికి కట్టబెట్టింది వైఎస్సార్సీపి. ఆ తరువాత ఎమ్మెల్సీ ఇచ్చినా..దానిని వదిలేసి మరీ దక్షిణంలో పోటీచేసి తన సత్తాను నిరూపించుకున్నారు వంశీ. తరువాత వైఎస్సార్సీపి ఘోరంగా ఓడిపోవడంతో అంతర్మధనంలో పడిన కార్పోరేటర్లు. అనుకున్నట్టుగానే హేండిచ్చేశారు. కూటమి మేయర్‌ పీఠానికి సరిపడ కార్పోరేటర్లంతా వచ్చేయడానికి రంగం సిద్దం అయిపోయింది. ప్రస్తుతానికి లెక్క 12మీద ఉన్నా ఆ సంఖ్య భారీగా పెరగడానికే అవకాశాలున్నాయి. వైఎస్సార్సీపీ కార్పోరేటర్ల మహా తిరుగుబాటు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలగా అదంతా పార్టీలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వలనే వచ్చిందని..వాళ్లంతా తమకు కనీసం గౌరవం ఇవ్వలేదని.. ఏఒక్క పనికూడా చేసుకోలేకపోయిన కారణంగా పార్టీని వీడాల్సి వస్తుందని తాజా మాజీల మొహం మీద చెప్పేసి మరీ బయటకు వచ్చేయడం చర్చనీయాంశం అవుతోంది.అసలు టిడిపి పార్టీ భూ స్థాపితం అయిపోతుందని ప్రగల్బాలు పలికిన వైఎస్సార్సీపి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి కార్పోరేట్లు మహా తిరుగుబాటుతో దిమ్మతిరి మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా చేసింది.