విశాఖలో జర్నలిస్టు లక్ష్మణ్ అంతిమ యాత్ర హోరు వానలోనూ కలంగ కార్మికులతో ముందుకి సాగింది.. జర్నలిస్టు మిత్రుల అశృనయనాల మధ్య జర్నలిస్టు పార్ధీవ దేశం ఖర్మభూమికి చేరింది. కలం నిన్ను మరిచిపోదు మిత్రమా.. కెమెరా కన్ను నిన్న వీడదు.. నువ్వు దూరమైనా..నీతో గడిపి క్షణాలు.. నీతో కలిసి రాసిన వార్తలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి..! భువిని వీడిన నీకోసం స్వర్గద్వారం తలుపు తెరిచుకుంది. జర్నలిస్టు బ్రతికున్నా వార్తలే.. మరణించినా వార్తలే.. మాతో ఉన్నంత కాలం భూలోకంలో రిపోర్టింగ్ చేసిన నువ్వు.. కాలంచేసి ఇపుడు పైలోకానికి పయనం అయ్యావు.. నాకు తెలిసీ అక్కడా నీ సహచర జర్నలిస్టులతో కలిసే పనిచేస్తావు.. పై లోకపు వార్తలన్నీ నువ్వే రాస్తావు.. నీ కెమెరా కంటితోనే చిత్రస్తావు.. జర్నలిస్టులమైన మేము.. నీకుజర్నలిజం పరిభాషలోనే అంతిమ వీడ్కోలు పలుకుతున్నాం.. కన్నీటి కలంతో.. దిగమింగిన బాధతో.. విశాఖ జర్నలిస్టులు..!
-అండగా నిలబడిన నగరంలో నేడు
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో కేవలం జర్నలిస్టుతో నడపబడుతున్న గ్రూపు ‘నగరంలో నేడు’. ఈ గ్రూపు జర్నలిస్టులకి ఒక వసుదైక కుటుంబం. ఎక్కడైనా జర్నలిస్టుల గ్రూపులంటే పీడిఎఫ్ పేపర్లు, వెబ్ సైట్ లింకులు, న్యూస్ యాప్ పేజీలు.. పనికిమాలిన సొల్లు మెసేజ్ లు దర్శనమిస్తాయి. కానీ ఈ గ్రూపులో ఆరోగ్యకరమైన చర్చజరగుతుంది.. అందరికీ పనికొచ్చే తాజా వార్తలు దొరుకుతాయి.. ప్రముఖుల ఫోన్ నెంబర్లు..ఇతరత్రా మీడియాకి పనికొచ్చే సమాచారం.. ఒకటేంటి అని జర్నలిస్టులకి పనికొచ్చేవి మాత్రమే దొరుకుతాయి.. ఆత్మీయతకు ప్రాధాన్యం.. అనసర వ్యవహారాలకు తిరస్కారాలూ గట్టిగానే ఉంటాయి. అంతకంటే ముఖ్యంగా రిజిస్ట్రేషన్ లేని స్వచ్చంద సంస్థలా జర్నలిస్టుల కోసం స్వచ్చందంగా పనిచేస్తుంది ఈ గ్రూపు.. అదేంటి అనే అనుమానం మీకు రావొచ్చు.. అవును మీరు చదువుతున్నది నిజమే.. ఇది కేవలం వాట్సప్ గ్రూపే కాదు.. వర్కింగ్ జర్నలిస్టుల పాలిట కామధేనువు కూడా. ఈగ్రూపులో ఎవరికైనా ఆపద అని ఒక్క మెసేజ్ పెడితే ఈ గ్రూపులో ఉన్న జర్నలిస్టులు, కెమెరామెన్ లు, సబ్ ఎడిటర్లు, మరికొందరు పీఆర్వోలు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు స్పందించే తీరు మాటల్లో చెప్పలేం. అనుకున్నదే తడవుగా ఆర్ధిక సహాయం చేయడానికి ముందుకొస్తారు. మేమున్నామంటూ దైర్యం చెబుతారు. అభిమానంతో ఆదరిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే నగరంలో నేడు కేరాఫ్ రియల్ హెల్ప్.. జర్నలిస్టు లక్ష్మణ్ విషయంలో నగరంలో నేడు గ్రూపు ద్వారా జర్నలిస్టులు స్పందించిన తీరు నభూతో నభష్యత్..!
-కంచర్ల అచ్యుతరావు...ఈయన మనిషి కాదు దేవుడు
ఎవరైనా ఐదు రూపాయలు సహాయం చేసి 100 రూపాయల పబ్లిసిటీ పొందుతారు. ఈయన మాత్రం కుడిచేత్తో చేసిన సహాయాన్ని ఎడమచేతికి తెలియనీయరు. నిండైన మనసుతో..మదినిండా అభిమానంతో ఈయన అందించే ఆపన్న హస్తం అందుకున్నవారిని లెక్కించడం కూడా కష్టమే. అలాంటి వ్యక్తి నగరంలో నేడు గ్రూపులో ఒక సభ్యుడు. బహుసా మానవత్వ పరిమళం ఎలా ఉంటుందని అడిగితే ఈయన ఫోటోని చూపిస్తే సరిపోతుంది. అంతటి నిర్వార్ధ సేవకులు ఈయన. అందరివాడుగా.. అపద్భాంవుడిగా.. సేవకుడిగా.. సినీ నిర్మాతగా.. చారిటబుల్ ట్రస్టు నిర్వాహకునిగా ఈయన చేసే సహాయం అంతా ఇంతా కాదు. అలాంటి మంచి వ్యక్తి గ్రూపులో ఉంటూ ఎప్పటికప్పుడు జర్నలిస్టుల కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటూ చేయూత నందిస్తారు. పక్కవాడికి రూ.10 పెట్టి టీ, కాఫీ ఇప్పించడానికి లెక్కలు వేసే ఈ రోజుల్లో ఆయన చేసే సహాయం మాటల్లో చెప్పలేం. జర్నలిస్టులంటే ఈయనకుండే గౌరవం, మర్యాద, అభిమానం, ప్రేమ బహుసా ఏ స్వచ్చంద సంస్థల నిర్వాహకులకు ఉండవని ఘంటా పథంగా చెప్పొచ్చు. అంతలా ఆయన జర్నలిస్టులను చేరదిస్తారు. అదే స్థాయిలో సేవలూ అందిస్తారు. జర్నలిస్టు లక్ష్మణ్ విషయంలో ఈయన చేసిన ఆర్ధిక సహాయం మరువలేనిది. ఒకటి కాదు రెండు కాదు మూడు పదులు దాటిన వేలకి పైగా ఆర్ధిక సహాయం చేశారు.
-ప్రతీ చోటా నగరంలో నేడు లాంటి గ్రూపులంటే జర్నలిస్టులు ఒంటవారవరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు రావు.. కనీసం ప్రెస్ అక్రిడిటేషన్ కూడా గత ప్రభుత్వాలంటివి అధికారంలో ఉంటే స్థానిక పత్రికలు కూడా కనుమరుగైపోతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా..ఏ పార్టీ అధికారంలో ఉన్నా నగరంలో నేడు లాంటి గ్రూపులు ప్రతీ ప్రాంతానికి ఉంటే ఆర్ధికంగా ఏ తోడ్పాటు లేని జర్నలిస్టులు ఒంటరివారవరు ఇదైతే పక్కా. అంతటి ప్రాచుర్యం, ప్రాముఖ్యత కలిగిన గ్రూపుగా నగరంలో నేడు నేడు అన్ని చోట్ల ప్రశంసలు అందుకుంటోంది. ఆపదలో ఉన్న జర్నలిస్టులకు ఇనిస్టెంట్ సహాయం అందించే ఏకైక గ్రూపు ఇదే కావడం విశేషం. మహావిశాఖపట్నంలోని అన్ని ప్రముఖ మీడియా సంస్థల రిపోర్టర్లూ ఈ గ్రూపులో సభ్యులు గా ఉంటారు. వున్నవారంతా జర్నలిస్టులకు తోడ్పాటు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి వారి మధ్యలో కంచర్ల అచ్చుతరావులాంటి మహానుభావులు కూడా జర్నలిస్టులకు, చక్కటి ఇలాంటి గ్రూపులకు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు.
-నేనొక నిమిత్త మతృడిని మాత్రమే సహకారం అంతా జర్నలిస్టులదే..ఎమ్మెస్సార్ ప్రసాద్
నగరంలో నేడు గ్రూపు నిర్వహణ మాత్రమే చూస్తుంటాను. అందరిలో నేను ఒకడిని కానీ ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా స్పందించడానికి మా గ్రూపులో చాలామంది జర్నలిస్టులు, నిశ్వార్ధసేవకు ముందుకి వస్తారు. వెంటనే స్పందిస్తారు. గ్రూపు ఇంత చక్కగా నడవటానికి మేము తీసుకునే కఠిన నిర్ణయాలు, పీడిఎఫ్, యూట్యుబ్ లింక్స్ పెట్టకుండా కేవలం వార్తా సమాచారం మాత్రమే పెడుతూ అందరం ఇందులో భాగస్వాములుగా ఉంటాం. జర్నలిస్టులకు ఎలాంటి ఆపద వచ్చినా అందరం స్పందించడానికి నగరంలో నేడు గ్రూపు ఒక చక్కటి కుటుంబ వేదిక.
-జర్నలిస్టులకు సహాయం అందించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం..కంచర్ల అచ్యుతరావు
సమాజంలో నాల్గవ స్థంబంగా ఉన్న మీడియా..అందులో పనిచేసే నా తమ్ముళ్లైన జర్నలిస్టులకు సేవ చేసుకునే భాగ్యం దక్కడం నాఅదృష్టం. నన్ను అంతా ఏదేదో తారాస్థాయికి ఎత్తేస్తారు కానీ.. అవేమీ నాకు గిట్టవు.. నచ్చవు.. నావంతుగా ఎంత సేవ చేశాననేది మాత్రమే నేను చూసుకుంటాను. అందులో విశాఖలోని జర్నలిస్టులతో నాకున్న బంధం వేరు. బంధం అనే కంటే వారంతా నా కుటంభంగా భావించి అందరిలో నేను ఒకటిగా ఉంటాను. మీడియా అన్నా..అందులో పనిచేసే జర్నలిస్టులన్నా నాకు ఎంతో గౌరవం అభిమానం బహుసా అదే నన్ను వారికి దగ్గర చేసిందేమో.. అదే నాతో సేవచేయిస్తుందేమో అనిపిస్తుంటుంది ఏ జర్నలిస్టుని చూసినా. ఏ జర్నలిస్టు ఆపదలో ముందుకి వచ్చి సహాయం అందించినా.. మీడియాని ప్రభుత్వాలు, ప్రజలు, స్వచ్చంద సేవకులు అంతా గుర్తించినపుడే మనవంతుగా మీడియాకి సహాయం చేయడానికి వీలుపడుతుంది. బాహ్యప్రపంచంలో జరిగే విషయాలన్నీ అందరికీ తెలుస్తాయి.. జర్నలిస్టులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్నదే నా అభిమతం.