విశాఖ, అరకు, పాడేరుల్లో సూపర్ లొకేషన్స్ - నిర్మాత డా.కంచర్ల


Ens Balu
33
visakhaptnam
2024-08-04 17:39:03

సినిమా ఇండస్ట్రీ షూటింగ్ ల కోసం ఎక్కడికో విదేశాలకు వెళ్లాల్సిన పనిలేదని.. దానికి మించిన షూటింగ్ లొకేషన్లు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని విశాఖ సిటీ, పాడేరు, అరకు, లంబసింగి ప్రాంతాల్లో ఉన్నాయని ప్రముఖ నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. గోవాను తలదన్నే బీచ్ లొకేషన్స్ విశాఖలో ఉన్నాయన్నారు. హాలీవుడ్ సినిమాలకు పనికొచ్చే యారాడ బీచ్ ప్రపంచంలో మరెక్కడా ఉండదన్నారు. విశాఖలోని ప్రముఖ హోటల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫారెస్ట్ లొకేషన్స్ గానీ, చలి కాలంలో తీసే సీన్లుకు గానీ అరకు అందాలకు కొదవ లేదన్నారు. మాఫియా నేపథ్యంలో చేసే సినిమాలకు విశాఖ పోర్టు అత్యంత అద్భుతంగా వుంటుందని అన్నారు. తాము తీసే సినిమాలు ఎక్కు మొత్తం విశాఖజిల్లాలోనే తీస్తున్నామని చెప్పారు. విశాఖజిల్లాలో ఏ స్థాయిలో బ్యూటిఫుల్ సినిమా లొకేషన్స్ ఉన్నాయో తమ సినిమాల్లో అద్భుతంగా చూపించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన తరువాత సినీ పరిశ్రమ విశాఖకు రావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఇక్కడ కళాకారులకు లోటు లేదన్నారు. విశాఖను సినిమాకు కేరాఫ్ గా మార్చేందుకు అన్ని వర్గాల సహకారం తీసుకొని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. మీడియా కూడా విశాఖలోని మంచి మంచి లొకేషన్స్ ను చిత్రించి, టివీ ఛానల్స్ కూడా వాటిని కవర్ చేసి సినిమా ప్రపంచాన్ని విశాఖపైవపు  చూపు తిప్పుకునేలా చేయాలని కోరారు.