ప్రతి ఇంటిపై ప్రతి పౌరుడు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలని , భారత స్వాతంత్ర్య సంబరాలకు స్ఫూర్తిని కలిగించాలని జీవీఎంసీ కమిష నర్ పి.సంపత్ కుమార్ విశాఖ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన భారత త్రివర్ణ పతా కాన్ని చే తబట్టి విశాఖ నగర ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, 2024 ఆగస్టు 15 భారత స్వాతంత్ర్య దినోత్సవం సం దర్భంగా భారతదేశమంతా ఆగస్టు 9 వ తేదీ నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తుందని, విశాఖ నగర ప్రజలం దరూ, జీవీఎంసీ యంత్రాంగం అంతా ప్రతి ఇంటిపైన భారత త్రివర్ణ పతాకం ఎగురవేస్తూ సెల్ఫీ ఫోటో తీసుకొని హర్ ఘర్ తిరంగా కార్యక్ర మం లో పాల్గొని https://harghartiranga.com/ వెబ్సైట్లో నమోదు చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. భారత స్వాతంత్ర్య సంబరాలకు స్వా గతం పలుకుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రతి పౌరుడు పాల్గొంటూ స్ఫూర్తిని కలిగించాలని కోరారు. ఆదివారం కమిషనర్ తన క్యాంపు కార్యాలయంలో భారత త్రివర్ణ పతాకాన్ని చేతబట్టివిశాఖ నగర ప్రజలందరికీ పత్రికా ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు.