మెగాస్టార్ జీవిత చరిత్రపై సినిమా నిర్మిస్తా-డా.కంచర్ల


Ens Balu
17
visakhapatanm
2024-08-17 19:25:40

ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, సినీ నిర్మాత, ఎస్ఎస్ఎల్ఎస్ అధినేత, టిడిపి సీనియర్ నాయకులు డా.కంచర్ల అచ్యుతరావు గుడ్ న్యూస్ చెప్పారు.  మెగాస్టార్ చిరంజీవి జీవితను బయోపిక్ గా నిర్మిస్తానని సంచలన ప్రకటన చేశారు. ఉపకార్ ట్రస్టు ఆధ్వర్యంలో విశాఖలో 5రోజుల పాటు చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డా.చిరంజీవి కళాపరిషత్ ఆధ్వర్యంలో పద్మవిభూషన్ డా.మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేశారు. అనంతరం డా.కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, సినీరంగంలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఈరోజు భారతదేశం గర్వించే స్థాయి నటుడు అయిన ఘనత ఒక్క చిరంజీవికే దక్కుతుందన్నారు. ఆయన జన్మదిన వేడుకలను విశాఖలోనే పెద్ద ఎత్తున నిర్వహించనున్నామన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అయన ఎన్నో వేల మందికి ప్రాణదానం చేశారన్నారు. ఆయన స్పూర్తితో ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు తరపున మరింతగా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. భారతదేశ సినీ ప్రపంచంలో నటులకు, సేవలకు ఆయన మార్గదర్శిగా అభివర్ణించారు. 

మెగా స్టార్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఆయన ప్రతీ పుట్టిన రోజును ఘనంగా చేసే అవకాశం నాకు రావాలని కోరుకు న్నారు. ఈరోజు జరిగిన ఈ మెగా ఈవెంట్ అభిమానులు చూపించిన ప్రేమ, అభిమానాలు తానెప్పుడూ మరిచిపోనన్నారు. చిరు స్పూర్తితో కళాకారులకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఈ కంచర్ల అచ్యుతరావు ఉంటారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పిన ఆయన గెంబిలి జగదీష్ అండ్ టీమ్ చేపట్టిన ఈవెంట్ మెగా స్టాండ ర్డ్స్ తోనే ఉందన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ కళాపీఠం బ్రోచర్ ను కంచర్ల ఆవిష్కరించారు.  కార్పోరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీకి చిరంజీవి మెగాస్టార్ అయితే విశాఖకు మాత్రం డా. కంచర్ల అచ్యుతరావు మాత్రమే మెగాస్టార్ అని కొనియాడారు. మంచి మనసుతో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ అందరివాడిగా సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. అనంతరం కళాకారులు, చిరంజీవి అభిమానులు పండుగ వాతావరణంలో డా. కంచర్ల అచ్యుతరావుని ఘనంగా సత్యరించి.. మహరాజా టోపిని అలంకరించి, దుస్సాలు వాను కప్పారు.  సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ నిర్విరామంగా చేపట్టిన సాంస్క్రుతి కార్యక్రమాలు ఆహుతలను విశే షం గా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులతోపాటు పెద్ద ఎత్తున చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొ న్నారు.