ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ , ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ లు సంయుక్తంగా రాష్ర్టంలో జర్నలిస్టుల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం విశాఖలోని పౌర గ్రంథాల యంలో ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ యూనిట్ కార్యవర్గానికి నూతన సభ్యత్వ కార్డులను శ్రీనుబాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు జర్నలిస్టులకు చేయాల్సిన సంక్షేమం చేస్తాయని , అయితే వాటిపైనే పూర్తి స్థాయిలో ఆధారపడకుండా స్థానిక అసోసియేషన్ లు కూడా సభ్యుల సంక్షేమానికి సేవలందించాలని పిలుపునిచ్చారు. అలాగే సాటి జర్నలి స్టు కష్టనష్టాల్లో కూడా పాలు పంచుకోవాలని సూచించారు. అంతకు మించి ఆరోగ్య భీమా, ప్రమాధ బీమాతో పాటు ప్రభుత్వపరంగా వచ్చే సంక్షేమ పథకాలను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రిడేషన్, అటాక్స్ కమిటీతో పాటు సంక్షేమ కమిటీల్లోనూ యూనియన్లకు ప్రాతినిధ్యం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి.నారాయణ, కార్యదర్శి జి.శ్రీనివాసరావులు మాట్లాడుతూ, సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఎప్పటిలాగే వినాయకచవితి, విజయదశమి, పర్వదినాల వేడుకలను ఈ ఏడాది కూడా తమ యూనియన్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రాడ్ కాస్ట్ విశాఖ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్ ల ఆధ్వర్యంలో సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా నూతన సభ్యత్వం స్వీకరించనున్నట్లు వీరు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు మళ్ల దేవ త్రినాధ్, రాజశేఖర్, నాయుడు, అంబటి శేషు, శివ దిలీప్, సురేష్, గోపి తదితరులు పాల్గొన్నారు.