సమిష్టి కృషితో ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి-డా.కంచర్ల


Ens Balu
20
thadekpalligudem
2024-08-26 16:47:25

తెలుగు సినీపరిశ్రమలోని అందరి కృషితో  ఫెడరేషన్ ను అభివృద్ధి చేయడంతోపాటు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఆంధ్రప్ర దేశ్ ఫిల్మ్ ఫెడరేషన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లిగూడెంలో జరిగిన ఫెడరేషన్ సభ్యుల అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సినీ నిర్మాతగా, ప్రభుత్వంలోని మనిషిగా తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఫెడరేషన్ అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా ప్రతీ ఒక సభ్యుడు ఖచ్చితంగా సభ్యత్వాలను కట్టి, పాతవారు రెవిన్యుల్ చేయించుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతీ సభ్యుడు ఈ-శ్రమ్ కార్డులు పొందాలన్నారు. తద్వారా కార్మికులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి అందే ప్రయోజనాలు పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమను ప్రమోట్ చేయడానికి అన్ని అవకాశాలను వినియోగిస్తూ.. ప్రభుత్వం దృష్టికి రాష్ట్రంలోని ఫెడరేషన్ సభ్యుల సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు. 

మాజీ మున్సిపల్ చైర్మన్,  నర్సాపురం పార్లమెంనియోజకవర్గం ఇన్చార్జ్ అబ్బయ్య మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కంచర్ల ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు సినిమాలకు అనువుగా వున్నాయని.. వాటిదగ్గర షూటింగులు జరిగితే ఫెడర్ రేషన్ సభ్యులందరికీ ఏడాది పొడవునా పనిదొరుకుతుందన్నారు. తాడేపల్లి గూడెం మాజీ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత సినీ పరిశ్రమకు ఒక వేదిక లేకుండా పోయిందని.. ఇపుడు ఆ బాధలు, ఆందోళన నుంచి ప్రతీ కార్మికుడు బయటపడే అవకాశం వచ్చిందన్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఫెడరేషన్ చైర్మన్ కావడం వలన ఇండస్ట్రీలోని ప్రతీ కార్మికుడికి మంచిరోజులు వచ్చినట్టేనని ఆశాభావం వ్యక్తం చేశారు.