ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఉపకార్ ట్రస్టు, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత సినీ నిర్మాత డా. కంచర్ల అచ్యు తరావు ఈ నెల 31విశాఖలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవలే ఫెడ్ రేషన్ ఈయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ శనివా రం సాయంత్రం 6 గంటలకు విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం లో పలువురు ముఖ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయను న్నా రు. ఈ మేరకు డా.కంచర్ల కార్యాలయం మీడియాకి ప్రకటన విడుదల చేసింది. ఆయన ప్రమాణ స్వీకారానికి నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తు న్నారు. కంచర్ల చాలా ఏళ్లు ఉపకార్ ట్రస్టు ద్వారా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖను సినిమా పరిశ్రమకు ప్రధాన వేదికగా చేయాలని కంకణం కట్టుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఏపీఎఫ్ఐఈఎఫ్ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.