జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు అతి త్వరలో పరిష్కారం-మంత్రి నారా లోకేష్


Ens Balu
16
visakhapatnam
2024-09-01 06:06:06

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు  విశాఖ టిడిపి పార్టీ ఆఫీసులో ఆయన్ని కలిసి ఇప్పటివరకు జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటా యింపు ప్రక్రియ లో జరిగిన పరిణామాలు వివరించారు. సొసైటీ అధ్యక్షులు బి.రవి కాంత్ మాట్లాడుతూ విశాఖలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కల నెరవేరడం లేదని, దీనిపై త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని మంత్రికి వివరించారు. మంత్రి లోకేష్ సావధానంగా సమస్యలన్నీ అడిగి తెలుసుకున్నారు. వెంటనే పక్కనే ఉన్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో ఈ సమస్యపై చర్చించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ అతి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. జర్నలిస్టులకు అండదండలు అందిస్తామన్నారు. ప్రధానంగా ఉన్న ఇళ్ల స్థలాల సమస్యపై అధికారులతో మాట్లాడి ఒక కార్యచరణ రూపొందిస్తామని చెప్పారు. అర్హులందరికీ  న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  సొసైటీ గౌరవాధ్యక్షులు జనార్దన్,  కోశాధికారి శరత్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొప్పన రమేష్, ప్రత్యేక ఆహ్వాని తులు యర్రా నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాగా.. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వార్షికోత్సవం సెప్టెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నట్లు  అధ్యక్షులు బి రవికాంత్, కార్యదర్శి యర్రా శ్రీనివాస్ తెలిపారు. భవిష్యత్తు కార్యచరణ రూపొందించ డంతోపా టు ప్రజాప్రతినిథులు అందరినీ ఈ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.