రక్త దాత ఒకసారి రక్తం దానం చేస్సతే ఐదుగురు వ్యక్తులకు అత్యవసర సమయంలో అది ఉపయోపడుతుందని జనసేన నాయకులు, క్రిష్ణదే విపేట ఉపసర్పంచ్ దుంపలపూడి సహదేవుడు పేర్కొన్నారు. జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్వ చ్చంద రక్తదానం చేసిన రక్తదాతలకు ఆయన మంగళవారం సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్చం దంగా సహాయం చేసే అలవాటుని యువత అలవాటు చేసుకోవాలని అన్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు వీలుగా రక్తాన్ని దానం చేసిన దాతలందరినీ ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీం జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు ఊడి చక్రవర్తి, సహాయ కార్యదర్శి సురేష్, ప్రధాన కార్యదర్శి హరినాథ్ , పాత జనసేన కార్యకర్తలు ఈర్ని చిన్ని, పాతాళ శివ గుడివాడ శివ, దుంపలపూడి శివ, స్కూల్ చైర్మన్ అని శెట్టి గోపి, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.