ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ బూర్లె వెంకయ్యప్పలస్వామికి ఏపీ ఎంఈడీపీఏ అవార్డు లభించింది. ఆంధ్ర ప్రదేశ్ మాస్టర్స్ ఎడ్యుకేషన్ ప్రోస్పెక్ట్ అసోసియేషన్ (ఏపీ ఎంఈడీ పీఏ)వారు ప్రతీ ఏటా అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఈ ఏడాదికి గాను డాక్టర్ బీవీఏ స్వామిని ఎంపిక చేసి అందజేశారు. ఈ అవార్డును ఏపీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి వి ఏ స్వామికి హైదరాబాద్ లో అందించారు. ఈ సందర్బంగా అవార్డు గ్రహీత స్వామి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మకమైన అవార్డు తనకు లభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. గుర్ల మండలం గూడెం గ్రామానికి తాను అసిస్టెంట్ ప్రొఫెసరుగా అందించిన సేవలు, అనుభవం, వివిధ పరిశోధనలతో పాటు పలుఅభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు గాను తనకి అవార్డు లభించందన్నారు. కాగా తమ యూనివర్సిటీకి చెందిన, అవార్డు అందుకున్న అసిస్టెంట్ ప్రొఫెసరు డాక్టర్ బి వి ఏ స్వామిని ఆదికవి నన్నయ యూనివర్సిటీ తాడేపల్లిగూడెం క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి.అశోక్ తోపాటు అధ్యాపక సిబ్బంది, సహచరులు హర్షం వ్యక్తం చేశారు.