చినగదిలో డా.కంచర్ల మహా అన్నదానం..పెల్లుభికిన జనాభిమానం


Ens Balu
21
visakhapatnam
2024-09-26 14:49:12

ప్రజలకు చేసే నిశ్వార్ధ సేవైనా.. దేవుడు మెచ్చేలా చేసే నిండుగా ఉండే పూజలైనా.. భక్తుల మనుసుకి నచ్చే అన్నదానమైనా.. ఉపకార్ ఛారి టబుల్ ట్రస్టు చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ప్రముఖ సేవకులు, విద్యాదాత డా.కంచర్ల అచ్యు తరావు మార్కు ఉండాల్సిందే.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 రకాలతో భారీ ఎత్తున చేపట్టిన మహా అన్నదానం విశాఖలో రికార్డు సృష్టిం చింది. మహావిశాఖ పరిధిలోని ఆరిలోవ చినగదిలో వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేషుడి మండపంలో 24 అడుగుల ఎత్తులో  స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు 24 రోజుల పాటు దూపదీప నైవేద్యాలతో సాక్షాత్తూ ఆ గణపయ్యే మెచ్చేవిధంగా పూజలు చేశారు.. 24 రోజుల పాటు 24 రకాల ప్రసాదాలు పంచిపెట్టారు..24వ తేదీనే స్వామిని అనుపుచేశారు.. అదే 24 రకాలతోనే 5వేల మందికి పైగా మహా అన్న దానం చేపట్టారు. మహా భోజ ఏర్పాటు చేసిన మహా అన్నదానం ప్రసాదంగా స్వీకరించిన వారంతా ఇపుడు నిండైన మనసుతో నిర్వాహకులను ఆశీర్వదిస్తున్నారు. ఏన్నో ఏళ్ల నుంచి ఆరిలోవ చినగదిలి ప్రాంతంలో వినాయక మండపాలను ఏర్పాడు చేస్తున్న ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ఈ ఏడాది కూడా ఘనంగానే మండపాలు ఏర్పాటు చేసింది. అన్నింటా పెద్ద ఎత్తు కార్యక్రమాలను నిర్వహించింది. 

ఆఖరుగా 24 అడుగుల మహా గణపతి అనుపు మహోత్సవం రోజున చేసిన కూడా 24 సంఖ్య విశాఖలోని ఆరిలోవ వాసులకు గుర్తిండిపోయేలా భారీ అన్నసంతర్పణ కూడా చేపట్టింది. స్వయంగా డా.కంచర్ల అచ్యుతరావు ఈ మహా అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ మహాగణపతి ఆశీస్సులతో విశాఖ ప్రజలు శుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ప్రతీఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున గణేష్ మండపాలు ఏర్పాటుచేసి ఆ గణపతికి పూజలు చేసుకునే భాగ్యం దక్కిందన్నారు. ఈ ప్రాంత వాసులు తనపై చూపిస్తున్న అభిమానం.. ఆ దేవ దేవుడు ఇచ్చిన శక్తిమేరకు రానున్న రోజుల్లో కూడా మరింతగా కార్యక్రమాలు ట్రస్టు ద్వారా చేపడతామని చెప్పారు. పెద్దఎత్తున చేపట్టిన కార్యక్రమాల్లో ఈ ప్రాంతవాసులు భారీగా పాల్గొని విజయవంతం చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అంతకుముందు స్వామివారి అనుపు సందర్భంగా కంచర్ల ఆ మహాగణపతికి ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు సుధీర్, నాగు, తదితరులు పాల్గొన్నారు.