ఆసుపత్రిలో మంచాలు దారుణం.. లోచల రామక్రిష్ణ ఔదార్యం..!


Ens Balu
11
G.K.Veedhi
2024-10-01 14:34:59

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి  చాలా దారుణంగా ఉంది.. ఇటు ప్రభుత్వం గానీ.. గిరిజనాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటిడిఏలు కానీ వీటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.. గిరిపుత్రులకు వైద్య సేవలు చేయడానికి కనీసం ప్రభు త్వాలకి అవకాశం లేదో.. ఇక్కడ ఎందుకులే వసతులు అనుకున్నారో తెలీదు గానీ.. జెర్రిల ప్రాధామిక ఆరోగ్య కేంద్రంలోని మౌళిక వసతులను గాలికి వదిలేశారు. లక్షల రూపాయాలు జీతాలు ఇచ్చి ఉద్యోగులను, వైద్యుల పెట్టిన ప్రభుత్వం వేల రూపాయాలు ఖర్చు చేసి ఇక్కడ రోగుల సౌకర్యార్ధం కనీసం మంచాలు కూడా ఏర్పాటు చేయలేకపోయింది.. కాదు కాదు.. ఉన్నవి పాడైపోయినా పూర్తిగా పట్టనట్టు వదిలేసింది. ఏజెన్సీలోని నేతలు కూడా ఈ దీన పరిస్థితిపై కన్నెత్తి చూడలేదు. ఆ దారుణమైన పరిస్థితి కాస్తా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లోచల రామక్రిష్ణ వరకూ వెళ్లింది. దీనితో స్పందించిన ఆయన మంచి మనసుతో ముందుకొచ్చారు. జీకే వీధి మండలం జర్రెల  ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల కోసం ఏర్పాటు చేసిన మంచాలు పూర్తిగా పాడై పోవడంతో తనవంతు సహా యంగా ఆరు మంచాల ఏర్పాటు చేయడానికి రూ.20వేలు సహాయం చేశారు. 

ఆ మొత్తాన్ని ఆసుపత్రి సిబ్బంది.. గ్రామ పెద్దల సమక్షంలో వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లోచల రామక్రిష్ణ మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజనులకు ప్రాధమిక వైద్యం అందించాలని.. ఈ ఏజెన్సీ ప్రాంతంలో కనీసం వసతులు లేని పీహెచ్సీల్లో సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం గిరిజనులకు వైద్యసేవలు చేయడానికి రావాలనీ.. కనీసం ఆసుపత్రిలో రోగుల కోసం మంచాలు కూడా లేకపోతే గిరిజనులు వైద్యానికి వచ్చినా ఎక్కడు ఉండాలని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చే రోగులకు కనీసం వైద్య సేవలు అందే సమయంలో సేద తీరడానికి కూడా అవకాశం లేకపోవడం శోచనీయామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం, ఐటిడిఏ అధికారులు స్పందించి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మౌళిక సదుపాయాలతోపాటు ఖాళీగా ఉన్న సిబ్బందిని కూడా నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. గిరిపుత్రులు ఆసుపత్రికి వచ్చే సమయంలో ఇబ్బందులు పడకూడదనే మంచి ఆలోచనతో మంచాల ఏర్పాటు కోసం లోచల రామక్రిష్ణ ముం దుకి రావడం పట్ల గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యులు, సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.