కేబినెట్ దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య-పల్లా


Ens Balu
27
visakhapatnam
2024-10-03 16:16:49

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను కేబినేట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివా సరావు హామీ ఇచ్చారు. విశాఖ అక్రిడేటెడ్ వర్కింగ్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ ఆధ్వర్యంలో కార్యవర్గం గురువారం  ఆయన్ని కలిసి జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాల అంశాన్ని వివరించింది. విశాఖలో ఇళ్ల స్థలాలకు అనుకూలమైన ప్రభుత్వ స్థలాల వివరాలు ఆయ నకు అందజేశారు. అనంతరం పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించడానికి శాయశక్తులా కృషి చేస్తాన న్నారు. తమ ప్రభుత్వ హయాంలో తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్తా నని చెప్పారు. తప్పకుండా అర్హులైన జర్నలిస్టులందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పారు. సొసైటీ అధ్యక్షులు బి.రవికాంత్ మాట్లా డుతూ సుమారు 800 మందికి  పైబడి జర్నలిస్టులు ఇంటి స్థలం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా రన్నారు. వారందరికీ  ఈ ప్రభుత్వ హ యాంలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవ సలహాదారులు ధవలేశ్వరపు రవికుమార్, కోశాధికారి ఆలపాటి శరత్ కుమార్, సహాయ కార్యదర్శులు పి. శ్రీనివాసరావు,బందరు శివప్రసాద్,యూ భాస్కరరావు,ఆర్గనైజింగ్ కార్యదర్శి పీఏ రావు,ప్రత్యేక ఆహ్వాని తులు యర్రా నాగేశ్వరరావు, పవన్, సీనియర్ జర్నలిస్ట్ ఎస్.గురునాథ్  పాల్గొన్నారు.