సమాజానికి జర్నలిస్టులు..సైనికులు రెండు కళ్లు-హీరో ఉపేంద్ర


Ens Balu
8
visakhapatnam
2024-10-12 09:51:55

సరిహద్దుల్లో సైనికులు లేకపోతే దేశానికి రక్షణ లేదని.. రైతు వ్యవసాయం చేయకపోతే మనకి తిండి దొరకదని.. జర్నలిస్టులు లేకపోతే సమా జంలో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియదని.. దేశానికి సైనికులు, సమాజానికి జర్నలిస్టులు రెండు కళ్లు వంటి వారని, మూడో నేత్రం రైతేనని సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలోని తెలుగు జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో దసరా సంబు రాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన  హీరో ఉపేంద్ర జర్నలిస్టులు మిఠాయిు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు బాగుంటేనే సమాజం బాగుపడుతుందన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాకి ఏ కష్టమొచ్చినా ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ తన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. జర్నిస్టుల సంక్షేమం కోసం ట్రస్ట్ చైర్మన్, నిర్మాత డా.కంచర్ల అచ్యుతరావు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. జర్నలిస్టులు ఇలాంటి పండుగల సమయంలో ఒకో చోట కలిసి సంబరాలు జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు. 

జర్నలిస్టులు నిత్యవం సమాజ శ్రేయస్సు కోరి పనిచేస్తారని అలాంటి జర్నలిస్టులు నిర్వహించుకునే కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత అందించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులు వాస్తవాలను వెలికి తీయడంలో కీలకం గా వ్యవహ రించాలన్నారు. అదేవిధంగా విశాఖ టూరిజంను బాగా ప్రమోట్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో సినిమాలు ఎక్కువగా తీయడానికి కూడా అవ కాశం వుంటుందని చెప్పారు. ఏం చేయాలన్నా అది కేవలం మీడియా చేతుల్లోనే వుంటుందని.. మీడియా తలచకుంటే సినీ పరిశ్రమ మొత్తం విశాఖ తరలివస్తుందన్నారు. అనంతరం టిజెఎఫ్ నిర్వాహకులు ఘనంగా హీరో ఉపేంద్రబాబుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన పార్టీ స్టేట్ డాక్టర్స్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, నిర్వాహకులు పి.ఈశ్వర్, యూనియన్ ప్రతి నిధులు జార్జిఫెర్నాండేస్, ఎం.శ్రీనివాసరావు,  నందా, తదితరులు పాల్గొన్నారు.