అయ్యవార్లకు కోడిగుడ్డు ఫ్రై.. విద్యార్థులకు బంగాళ దుంప కూర..!


Ens Balu
24
dumbriguda
2024-10-24 16:41:10

ఏజెన్సీలో ఆశ్రమ పాఠశాల విద్యార్ధులకు పౌష్టికాహారం మాట ఎలా ఉన్నా.. అయ్యవార్లకు మాత్రం చక్కటి పౌష్టికాహారం విద్యార్ధులకి ప్రభు త్వం ఇచ్చే మెనూలో నుంచే తయారు చేసి పెడుతున్నారు.. విద్యార్ధులకు బంగాళా దుంపల కూర.. రసం పెడితే.. అయ్యవార్లకు మాత్రం ఎక్కడ నీరసం వస్తుందోనని ఎంచెక్కా కోడిగ్రుడ్ల ఫ్రై చేసి పెడుతున్న ఆశ్రమ పాఠశాల యాజమాన్యాలు.. ఇదేమీ ఏజెన్సీలో క్రొత్త కాదు.. కానీ డుంబ్రీగూడ మండంలోని సొవ్వా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈరోజు చిత్రం యూనిట్ పాఠశాల సందర్శించినపుడు మాత్రం విద్యార్ధులకు బంగాళా దుంపల నీరు కూరా.. ఉపాధ్యాయులకి చిక్కటి చక్కని కోడి గ్రుడ్ల ఫ్రై వడ్డించడం కనిపించింది.. ఏంటి ఆశ్రమపాఠశాలల్లోని ఉపా ధ్యా యులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకోరా అంటే మాత్రం.. అదేమీ లేదంటే.. పిల్లలకిచ్చే మెనూ లో నుంచి వారికి కాస్త రుచిగా.. సుచిగా వండి పెడతాం.. విద్యార్ధులకు మాత్రం యధాప్రకారం నీరు చారు.. పలచటి కూరలు వండి పెడతాం..ఇవేమీ మీకు తెలియకుండానే అడుగు తున్నారా అని సిబ్బంది మీడియానే తిరిగి ప్రశ్నించారు. సొవ్వ ఆశ్రమపాఠశాలలోని భోజన సందర్భాన్ని చిత్రీకరించినపుడు కనిపించిన దృశ్యాలివే.. ఇప్పటికైనా పాడేరు ఐటిడిఏ అధికారులు, జిల్లా కలెక్టర్లు ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్ధుల భోజనంలో కక్కుర్తిపడి కోడిగ్రుడ్ల కూరను తయారుచేయించుకొని తిన్న ఉపాధ్యాయుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి..

గిరిజన ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో చదివే విద్యార్థులకు సంపూర్ణ పౌష్టికాహారం అందించేందుకుగాను ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని అమలు చేయడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుండటంతో విద్యార్థులకు పౌష్టికాహారం సక్రమంగా అందడం లేదు. విద్యార్థులకు పెట్టాల్సిన పౌష్టికాహారాన్ని సక్రమంగా పెట్టడం లేదు. మండలంలోని సొవ్వా గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థులకు పెట్టాల్సిన భోజన మెనునూ సక్రమంగా పెట్టకుండా గురువారం మధ్యాహ్నం ఉపాధ్యాయులు గుడ్ ఫ్రై కూర వండుకుని , విద్యార్థులకు బంగాళదుంప కూరతో పాటు రుచి, పచి లేని సాంబార్ తో భోజనాలు పెట్టడమే ఇందుకు నిదర్శనం. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు గుడ్లును నాణ్యతగా ఫ్రై చేసి వంట చేసుకుని చేసుకుని తింటున్నారు. కానీ విద్యార్థులకు మంగళవారం పాలకూర పప్పుతో పాటు సాంబార్ తో పెట్టాల్సి ఉండగా బంగాళదుంప బటానితో పాటు నాసిరకమైన నీల లాంటి సాంబార్ తో భోజనాలు పెట్టారు. మెనూ అమలుతీరుపై  అధికారులు దృష్టి సారించకపోవడంతో  నాసిరకంగా భోజన మెనూ పెడుతున్నట్లు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు  ఆరోపిస్తు న్నారు. తక్షణమే సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి సొవ్వ ఆశ్రమ పాఠశాలలో భోజన మెనూ సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.