ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి అపార వనరులున్నాయ్- డా.కంచర్ల


Ens Balu
13
visakhapatnam
2024-10-26 17:14:44

 ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగానికి అపార వనరులు, అవకాశాలు ఉన్నాయని ప్రముఖ సినిమా నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, కళా భోజ డా. కంచర్ల అచ్యుత రావు పేర్కొన్నారు. శనివారం ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా  డాబా గార్డెన్స్  అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం లో  కంచర్ల యువసేన ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ పర్యాటకంతోపాటు, రాష్ట్ర పర్యాటక ప్రదేశాలను రాష్ట్రంలో నిర్మించే సినిమాల్లో ప్రమోట్ చేయడం ద్వారా ఈ ప్రాంత కళాకారులుకు, పర్యాటక ప్రదేశాలకు సినిమా రంగం కూడా ఆదాయాన్ని సమకూర్చినట్టు అవుతుందన్నారు. అనంతరం దంపతులిద్దరూ కట్ చేశారు. వారి కుమారుడు, ప్రముఖ హీరో ఉపేంద్ర తల్లిదండ్రులకు కేక్ తినిపించి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 

 అభిమానులు, సన్నిహితులు మద్య వివాహ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ పతాకంపై తన కుమారుడు ఉపేంద్ర హీరోగా 8 సినిమాల్లో నటిస్తున్నాడని తెలియజేశారు. ఒక సినిమా ఇప్పటికే విడుదల చేశామని తెలిపారు. మరో సినిమా నవంబర్ తొలి వారంలో విడుదల అవుతుందన్నారు.  ఈ సినిమా బడ్జెట్ ఐదు కోట్లు నుంచి 30 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మళయాలం, కన్నడం ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లో డైరెక్టర్లు పెద్ద సినిమాలు తీయలేరు, నిర్మించలేరనే అపవాదు హైదరాబాద్ లో వుందని.. తాను ఏపి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తరువాత సినీ రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రానికి తెలుగు చిత్ర పరిశ్రమ రావడానికి కృషి చేస్తున్న మంత్రి దుర్గేశ్ కి ధన్య వాదాలు తెలిపారు. 

ఈ సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకు వెళ్ళగా, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. విశాఖ పట్నం లో ఎందరో కళాకారులు వున్నారని.. విశాఖ షూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతోందన్నారు. అరకు వెలి సినిమా షూటింగ్ లకు ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.  నూతన సంస్థ కలాభోజ డాక్టర్ కంచర్ల కల్చరల్ అసోసియేషన్ ను లోగోను అభిమాను కరతాల ధ్వనుల మధ్య  ఆవిష్కరించారు. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన వారికి తన సినిమాలు, ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు కల్పిస్తామన్ని చెప్పారు. ఈ సంస్థ ద్వారా ప్రతి నెల ఒక పెద్ద కార్య క్రమం నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బాలభాను అర్చక సంఘం నిర్వాహకులు కంచర్ల దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహా చలం దేవస్థానం ధర్మ కర్తల మండలి మాజీ ధర్మ కర్త, జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు, దర్శకుడు యాద్ కుమార్, మా అధ్యక్షుడు భయ్యా శ్రీనివాస్, లోకేష్, నెహ్రూ, జగదీష్, రాజేంద్ర ప్రసాద్, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, సభ్యులు అరుణ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సాంస్క్రుతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.