అండమాన్ లో ఉత్తరాంధ్ర మత్స్యకారులకు ఎంపీ కలిశెట్టి భరోసా


Ens Balu
11
visakhapatnam
2024-10-27 06:25:07

అండమాన్ లోని మత్స్యకారులకు  సదుపాయాలు, రక్షణ, శిక్షణ కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో చర్చలు జరుపుతానని విజ యనగరం ఎంపీ, ఐ.టి & కమ్యూనికేషన్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు  కలిశెట్టి అప్పలనాయుడు భరోసా ఇచ్చారు.   సీఎం చంద్ర బాబు సూచనల మేరకు టిడిపి సభ్యత్వ నమోదుని అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ వారిని ఎంపి కలిసి ఉత్తరాంధ్ర మత్స్యకార కాలనీ, ఫిషింగ్ పోర్ట్ సందర్శించారు. అన్ని ప్రాంతాలను తిరిగి అక్కడి పరిస్థితిని అవగతం చేసుకున్నారు. వారి సమ స్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ నివసించే మత్స్యకారులకు ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. ఇక్కడి వారి జీవన విధానం, వేటకు వెళ్ళే నౌకలు, వేట కోసం ఉన్న పరిస్థితులు, వాటిలో ఉన్న ఇబ్బందులను సమగ్రంగా అర్థం చేసుకున్నారు. మత్స్యకారులంతా పేదరికంలో, స్వల్ప వనరులతో జీవనం సాగిస్తూ, సముద్రం మీద ఆధారపడిన జీవనానికి నిత్య కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారని ఎం.పి గుర్తించారు. జీవోపాదికై అండమాన్, నికోబార్ దీవులకు తరలివచ్చినప్పటికీ తమకోసం స్వయంగా వచ్చిన ఎంపీ కలిశెట్టిని అక్కడి వారు ఎంతో ఆప్యాయతగా ఆదరించి అక్కున చేర్చుకున్నారు. ఘనంగా సత్కరించారు. పెద్ద సంఖ్యలో ఉత్త రాంధ్రాకి చెందిన మత్స్యకార కుటుంబ సభ్యులు టిడిపి సభ్యత్వాన్ని స్వీకరించారు.