ఉర్రూతలూగించిన హీరో ఉపేంద్ర జన్మదిన వేడుకలు


Ens Balu
16
visakhapatnam
2024-10-30 18:54:04

యంగ్ టైగర్,  మిలీనియం హీరో కంచర్ల ఉపేంద్ర బాబు జన్మదిన వేడుకలు విశాఖలోని డాబాగార్డెన్స్ అల్లూరి సీతారామరాజు  విజ్ఞాన కేంద్రం లో అభిమానుల కేరింతలు.. హర్షధ్వానాల మధ్య ఉర్రూతలూగించాయి.  హీరో  కుటుంబ సభ్యులు, సమక్షంలో ఉపేంద్రబాబు భారీ కేక్ ను కట్ చేసి వారితో అనందాన్ని పంచుకున్నారు. అనంతరం హీరో ఉపేంద్రకు పలువురు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాం క్షలు తెలిపారు. తమ అభిమాన హీరోని గజమాలతో సత్కరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉపేంద్ర బాబు నటించిన కంచర్ల, ఉపేంద్ర బి పార్మసి, ఐపీసీ 369, అనగనగా కధలో, ఉపేంద్ర గాడి అడ్డా, 1920 భీమినిపట్నం, వధ, (ఒక దీరుడు కధ), విక్రమ్ కె దాస్,  చిత్రాల టీజర్స్ ను ప్రముఖల సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్బంగా  ఉపేంద్ర 9వ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు గంగిరెడ్డి తీస్తుండగా, 10వ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీయడానికి ముందుకు వచ్చింది. 

అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, తన చిత్రాల్లో విశాఖ కళాకారులకు పెద్ద పీట వేసినట్టు చెప్పారు. అంతేకాకుండా విశాఖను, ఇక్కడి పర్యాటక ప్రదేశాలను పెద్ద ఎత్తున తన సినిమాల్లో ప్రమోట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతానికి మరింత మంది రావడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. యంగ్ హీరో ఉపేంద్రబాబు మాట్లాడుతూ ప్రేక్షకులు తన చిత్రాలను ఆదరించాలన్నారు. మంచి కథ కధనంతో ఎంతో శ్రమ, వ్యవయం చేసి సినిమాలు తీస్తున్నామన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను సమ్మోహ నపరిచాయి. ఈ కార్యక్రమంలో కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, యాద కుమార్, ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, నాగు, అరుణ, జె ఎం నెహ్రు, రాజేంద్ర ప్రసాద్, జనార్దన్, గెంబలి జగదీష్, కళాకారులు,  కళాసంస్థల అధినేతలు, కంచర్ల కుటుంబ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.