అంగన్ వాడీలో ఎర్రబాట సేవలు..
Ens Balu
3
Kakinada
2020-09-30 14:31:05
అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మంచి ఆరోగ్యం వారి సొంతమవుతుందని ఎర్రబాట పత్రిక సంపాదకులు పితాని రాము అన్నారు. బుధవారం కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ, రేపూరు అంగన్వాడీ కేంద్రాల్లో ఎర్ర బాట 108 మంది పిల్లలకు టూత్ పేస్టులు, బ్రష్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సమయంలో పత్రిక ద్వారా తమ వంతు సహాయంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో మాస్కులు, శానిటైజర్ లు కూడా అందించడం జరిగిందన్నారు. అనంతరం కొవ్వాడ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ మాట్లాడుతూ, కొవ్వాడ, రేపూరు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న మూడు సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు పిల్లలకు పేస్టులు, బ్రష్ లు ఇవ్వడం అభినందనీయమన్నారు. అన్నివర్గాల దాతలు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నిరుపేద కుటుంబాలకు కాస్త ఆసరా దొరుకుంతుందని సూచించారు. దన సహాయం కన్నా కరోనా సమయంలో వస్తు సహాయం ఎంతో ఉపయోగంగా వుంటుందని దాతల సహాయాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.