కార్మికుల సమిష్టి కృషితో సమస్యలు పరిష్కరించుకునేందుకు ముందుడుగు వేయాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నూతన కార్యవర్గం పిలుపు నిచ్చింది. యూనియన్ నూతన కార్యవర్గం స్థానిక విక్రమహాల్ లో జరిగింది. ఈ సందర్భంగా నూతన ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ, మన ట్రేడ్ యూని ప్రస్తుతం రాష్ట్రంలో కార్మికుల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నదన్నారు. సభ్యుల సంక్షేమంతో పాటు, సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు సమస్యలు తీసుకెళ్లి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా యూనియన్ సభ్యులంతా ప్రతీ నెలా 4న పనులు ఖచ్చితంగా నిలిపివేయాలన్నారు. అదే సమయంలో అత్యవసర సమయంలో యూనియన్ అనుమతి ముందురోజు తీసుకోవాలన్నారు. యూనియన నిబంధనలు పాటించాలని.. అలా పాటించని వారిపై పనుల వద్ద తిరిగే స్వ్కాడ్ చర్యలకు గురికావాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. 2025 నుంచి యూనియన్ కొత్తరేట్లు పాటించాలన్నారు. జనవరి నుంచి కొత్త రేట్లు నిర్మాణాల్లో అమలవుతాయని పేర్కొన్నారు.
అలాగే ఉర్జవీర్ అనే పథకములో సభ్యులందరూ నమోదు కావాలని కోరారు. ఈ పథకంలో ప్రతి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ పాల్గొని బ్యాంక్ అకౌంటు, మీ ఆధార్ కార్డు ,పాన్ కార్డు, మీరు మీ సెల్ నుండి నమోదు చేసుకోవాలని తెలియజేశారు. గౌరవ అధ్యక్షులుగా ఎడ్ల సూర్య చంద్రరావు, ఎంవిజివి ప్రసాద్, గౌరవ సలహాదారు కాకి రవిబాబు, బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి ఎన్నిక అనంతరం యూనియన్ చేపట్టే కార్యక్రమాలను సభ్యులకు వివరించారు. వీరి సమక్షంలోనే ఏకగ్రీవంగా స్టీరింగ్ కమిటినీ కూడా ప్రకటించారు. అంతకు ముందు కమిటీ మెయిన్ కోర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. కమిటీలో గౌరవ సలహాదారులు గంట సతీష్, అధ్యక్షులుగా బొజ్జ రామకృష్ణ , ఉపాధ్యక్షులు వీరవల్లి గంగాచార్యులు, సెక్రెటరీ ఆసపు శ్రీనివాస్ బుజ్జి, జాయింట్ సెక్రెటరీ సీమల వీరభద్రరావు, కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం, ఉప కోశాధికారి సారవకోట లక్ష్మణరావు, స్టాండింగ్ కమిటీ చైర్మన్, స్క్వాడ్ కమిటీ చైర్మన్ గోవాడ కొండబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముదాలపల్లి కామేశ్వరరావు, యూనియన్ కన్వీనర్ చల్ల వరప్రసాద్, కమిటీ సభ్యులుగా ఊర్ల శ్రీరాములు, అల్లంకి వీరభద్ర స్వామి, గొల్ల రవి, గడ్డం ప్రసన్న కుమార్, ఉత్తరాల సోమేశ్వరావు, ఎడ్ల శేఖర్, నిమ్మలపూడి రవి వర్మ, జనిపే పూర్ణచంద్రరావు, గొల్లగాని విజయభాస్కర్, సొరసాని వెంకట గంగా చందు పాలపర్తి అప్పారావులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.