ఏపీకి సినీ పరిశ్రమను తరలించడానికి అవిశ్రాంత కృషి-డా.కంచర్ల


Ens Balu
37
visakhapatnam
2024-11-23 09:46:43

ఆంధ్రప్రదేశ్ కు వీలైనంత త్వరగా సినిమా పరిశ్రమను తీసుకు వస్తామని.. తద్వారా మరింత మంది కళాకారులకు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపి పిల్మ్ ఇండస్ర్టీ ఫెడరేషన్ ఛైర్మన్, ఉపకార్ ట్రస్టు ఛైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు అన్నారు. శనివారం విశాఖలోని పౌరగ్రంధాలయంలో పవన్ కళ్యాణ్ కళాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా సంగీత విభావరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్యుతరావు మాట్లాడుతూ,  ఏపికి సినీ పరిశ్రమ తరలివచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ మేరకు ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించిన విషయాన్ని కంచర్ల గుర్తు చేశారు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా సినిమా రంగానికి సంబంధించి అపారమైన వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని సినీ నటులు, దర్శక నిర్మాతలు సద్వినియోగం చేసుకుంటే ఈ ప్రాంతం పర్యాటక, సినిమా పరంగా మరింత అభివృద్ధి చెందేందుకు దోహద పడుతుందన్నారు.

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలోనే సినీ విభాగానికి చెందిన కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ సినీ స్టూడియోలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నందున.. ఇక్కడే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా సినీ వర్గాలు తమ కార్యాకలాపాల కోసం అయినా విశాఖ వస్తారు. వచ్చినపుడే ఇక్కడి అందాలను ప్రదేశాలను చూసి.. ఇక్కడే సినిమాలు తీయడానికి ఆస్కారం వుంటుంది. 24 ఫ్రేమ్స్ విభాగాలకు చెందిన కార్యకాలపాలు విశాఖ కేంద్రంగా జరిగితే  ప్రత్యక్షంగా కళాకారులకి, పరోక్షంగా వ్యాపారస్తులకి, నిర్మాతలకు పనివుంటుంది.

గౌరవ అతిధులుగా 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు, జనసేన డాక్టర్స్ సెల్ రాష్ర్ట అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు మాట్లాడుతూ నగరంలో నిత్యం అనేక కార్యక్రమాలు నిర్వహించే కళాకారులను ప్రభుత్వంతో పాటు ఆర్ధికంగా ఉన్న స్థితిమంతులు కూడా ఆదుకోవాల్సిన అసరం ఉందన్నారు. కళాకారులు నిరంతరం ప్రజలందరిని మెప్పిస్తున్నారని, అయితే వారికి కూడా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ కళాపీఠం గౌరవ అధ్యక్షులు గెంబలి జగదీష్ , అధ్యక్షులు మెరుపు వరప్రసాద్, కార్యదర్శి పీలా హరిప్రసాద్, కన్వీనర్ కె.ఇందిరా ప్రియదర్శినితో పాటు చెన్నా తిరుమల రావు, సన్ మూర్తి, ఇతర కళాకారులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మెగా సంగీత విబావరి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.